సంతోష్ శోభన్ (Santosh Shoban) కథానాయకుడిగా నటించిన సినిమా 'ప్రేమ్ కుమార్' (Prem Kumar Movies Telugu). ఈ సినిమాతో నటుడు, రచయిత అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా టీజర్ విడుదల చేశారు.
'ప్రేమ్ కుమార్ కథ' విడుదల చేసిన ప్రియదర్శి
'ప్రేమ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు?', 'అరే... ప్రేమ్ కుమార్ ఎక్కడ?' రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. ఆ ప్రేమ్ కుమార్ వచ్చేశాడు. ప్రముఖ నటుడు, కథానాయకుడు ప్రియదర్శి 'ప్రేమ్ కుమార్ కథ' పేరుతో సినిమా టీజర్ విడుదల చేశారు.
ప్రేమ్ కుమార్ కథ ఎలా ఉందేంటి?
Prem Kumar Movie Teaser Review : 'ప్రేమ్ కుమార్'లో సంతోష్ శోభన్ హీరో. ఈ సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఇందులో మరో హీరో కూడా ఉన్నాడు. అతని పేరు కృష్ణ చైతన్య. 'ప్రేమ్ కుమార్' కథలో చిత్రసీమ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో అతడు హీరోగా కనిపించనున్నారు. రీల్ లైఫ్‌లోని రీల్ లైఫ్‌లో హీరో అన్నమాట. మెయిన్ హీరోయిన్ రాశీ సింగ్ అయితే... రుచితా సాధినేని రీల్ లైఫ్‌లోని రీల్ లైఫ్‌లో హీరోయిన్ రోల్ చేశారు.
కథగా చూస్తే సంతోష్ శోభన్ హీరో అయితే... అతనికి విలన్ కృష్ణ చైతన్య. రాశీ సింగ్, రుచితా సాధినేని... ఇద్దరు హీరోయిన్లు ఎవరిని ప్రేమించారు? ఎవరి ప్రేమ కారణంగా ఎవరికి ఇబ్బందులు తలెత్తాయి? రుచితా సాధినేని ప్రేమించినది ఎవర్ని... సంతోష్ శోభన్‌నా? లేదంటే సినిమాలోని సినిమాలో హీరోగా నటించిన కృష్ణ చైతన్యనా? రాశీ సింగ్ ఏమనుకుంటుంది? సంతోష్ శోభన్‌ను కృష్ణ చైతన్య ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read : 'మిషన్ ఇంపాజిబుల్ 7' రివ్యూ : టామ్ క్రూజ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?
'ప్రేమ్ కుమార్' టీజర్ చూస్తే... టంగ్ ట్విస్టర్స్ కంటే కష్టమైన డైలాగులతో ఒక విధమైన గజిబిజి గందరగోళం క్రియేట్ చేశారు. సాధారణంగా తెలుగు తెరపై ముక్కోణపు ప్రేమ కథలు చాలా వచ్చాయి. ఇది రెండు జంటల నేపథ్యంలో ప్రేమతో తెరకెక్కించిన సినిమాగా తెలుస్తోంది. సామాన్య ప్రేక్షకులకు కథపై కాస్త క్లారిటీ రావాలంటే ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. పీటల మీద పెళ్లి ఆగిపోతే, ఆ పెళ్లి కొడుకు ఏం చేశాడు? అనే కథతో రూపొందిన చిత్రమిది. ఇదొక హిలేరియస్ ఎంటర్టైనర్ అని నిర్మాత తెలిపారు.
ఈ నెల 18న ట్రైలర్ విడుదల!
జూలై 18న 'ప్రేమ్ కుమార్' ట్రైలర్ (Prem Kumar Trailer) విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, ప్రభావతి, మధు తదితరులు నటించిన ఈ చిత్రానికి అభిషేక్ మహర్షి, అనిరుధ్ కృష్ణమూర్తి కథ అందించారు. ఎస్. అనంత్ శ్రీకర్ సంగీతం అందించారు. ఇంకా ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ : కృష్ణన్ సుజీత్, ఎడిటర్ : గ్యారీ బీహెచ్, ఛాయాగ్రహణం : రాంపీ నందిగాం, పాటలు: కిట్టు విస్సాప్రగడ, నిర్మాణ సంస్థ: సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి, నిర్మాత: శివప్రసాద్ పన్నీరు, దర్శకత్వం: అభిషేక్ మహర్షి.
Also Read : విస్కీ పూరితో వెరైటీ మాస్ ఇంట్రో - శివన్న కూడా ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial