'విరూపాక్ష' విజయంతో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సత్తా చాటారు. ఆ సినిమాకు ముందు ఆయనకు యాక్సిడెంట్ కావడం... 'రిపబ్లిక్'కు ప్రశంసలు వచ్చినప్పటికీ, ఆశించిన రీతిలో వసూళ్ళు రాకపోవడం... ఇతరత్రా అంశాల కారణంగా 'విరూపాక్ష'తో అందరి కన్ను పడింది. ఆ సినిమాతో సాయి ధరమ్ తేజ్ భారీ విజయం సాధించడమే కాదు, వంద కోట్ల క్లబ్బులో చేరారు. 


'విరూపాక్ష' నిర్మాతతో కొత్త సినిమా
'విరూపాక్ష' సినిమా సెట్స్ మీద ఉండగా... ఆ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌ పతాకంపై బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌, బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ నిర్మాణంలో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. దాంతో జ‌యంత్ పానుగంటి (Jayanth Panuganti) ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని తెలిసింది. 


'చీటీల చిన్ని'గా సాయి ధరమ్ తేజ్!
సాయి ధరమ్ తేజ్, జయంత్ పానుగంటి సినిమాకు 'చీటీల చిన్ని' (Cheetila Chinni) టైటిల్ ఖరారు చేశారని టాక్. ఫైనాన్స్ బిజినెస్ చేసే యువకుడిగా హీరోను డిజైన్ చేశారని తెలిసింది. చీటీలు కట్టించుకోవడం, అప్పులు ఇవ్వడం వంటివి ఉంటాయట. సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతుందని తెలిసింది.


Also Read నితిన్‌ కు హ్యాండ్ ఇచ్చిన రష్మిక - కొత్త హీరోయిన్ వేటలో వెంకీ 


సాయి తేజ్ జోడీగా సాక్షి వైద్య!
'చీటీల చిన్ని' సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటించనున్నారు. అఖిల్ అక్కినేని 'ఏజెంట్'తో తెలుగు తెరకు ఆమె పరిచయం అయ్యాయి. అయితే... ఆ సినిమా కంటే ముందు సాయి ధరమ్ తేజ్ సినిమా కోసం సాక్షి వైద్యను అప్రోచ్ అయ్యారట. 


Also Read బాబోయ్‌, 'ప్రేమ్ కుమార్ కథ'ను గుర్తు పెట్టుకోవడం కష్టమే - ట్విస్టులే ట్విస్టులు!  


Sakshi Vaidya Telugu Movies : సాయి ధరమ్ తేజ్ 'చీటీల చిన్ని' కంటే ముందు మరో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన 'గాంఢీవదారి అర్జున' సినిమాలో సాక్షి వైద్య నటించారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో కూడా ఆమె ఛాన్స్ అందుకున్నారు. ఈ నెలలో 'చీటీల చిన్ని' షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. 


ఈ నెలలో 'బ్రో'తో ప్రేక్షకుల ముందుకు...
'విరూపాక్ష' విజయంతో సంతోషంగా ఉన్న సాయి ధరమ్ తేజ్... ఈ నెలాఖరున మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మామ అల్లుళ్ళు కలిసి నటించిన సినిమా 'బ్రో'. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ 'శంభో శివ శంభో', నాని 'జెండా పై కపిరాజు' చిత్రాలకు దర్శకత్వం వహించిన సముద్రఖని 'బ్రో' మూవీకి దర్శకుడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ సినిమా నుంచి ఓ సాంగ్ విడుదల చేశారు. త్వరలో మరో సాంగ్ రానుంది. ఈ సినిమాలో సాయి తేజ్ జోడీగా 'రొమాంటిక్' ఫేమ్ కేతికా శర్మ నటించారు. ప్రియా ప్రకాష్ వారియర్ కూడా సినిమాలో ఉన్నారు. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial