తెలుగు చిత్రసీమకు రష్మిక (Rashmika Mandanna) కథానాయికగా పరిచయమైన సినిమా 'ఛలో'. దర్శకుడిగా వెంకీ కుడుములకు తొలి సినిమా అది. ఆయన తీసిన రెండో సినిమా 'భీష్మ' సినిమాలోనూ రష్మిక నటించారు. వీళ్ళిద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా ఆ మధ్య మొదలైంది. అయితే... సెట్స్ మీదకు వెళ్ళడానికి కంటే ముందు సినిమా నుంచి రష్మిక తప్పుకొన్నారు. 


నితిన్ సినిమాలో రష్మిక నటించడం లేదు!
'భీష్మ' హీరో హీరోయిన్లు నితిన్ (Hero Nithiin), రష్మిక, దర్శకుడు వెంకీ కుడుముల... ఈ ముగ్గురితో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా ప్రారంభించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఓపెనింగ్ కంటే ముందు సినిమా అనౌన్స్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. గుర్తుందా? 


'భీష్మ' ఇంటర్వ్యూల్లో వెంకీ కుడుముల స్క్రిప్ట్ రాయడం కంటే ముందు, ఓం కంటే ముందు కథానాయికగా రష్మిక పేరు రాస్తాడని నితిన్ సరదాగా కామెంట్ చేశారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలో కూడా సేమ్ మేటర్ చెప్పారు. అయితే... ఇప్పుడు రష్మిక పేరు బదులు కథానాయికగా మరొకరి పేరు రాయక తప్పదు. వై? ఎందుకు? అంటే... ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకొన్నారు. నితిన్, వెంకీ కుడుముల సినిమాలో ఆమె నటించడం లేదు. 


రష్మిక ఎందుకు చేయడం లేదు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా హిట్ 'పుష్ప' సీక్వెల్ 'పుష్ప 2'లో రష్మిక నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా సినిమా 'రెయిన్ బో'లో కూడా ఆమె నటిస్తున్నారు. ఈ రెండు కాకుండా మరో మూడు హిందీ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. 


Also Read 'మిషన్ ఇంపాజిబుల్ 7' రివ్యూ : టామ్ క్రూజ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?


ఐదారు సినిమాలతో రష్మిక బిజీగా ఉన్నారు. డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆమెకు కష్టం అవుతోంది. ఆ విషయాన్ని నిర్మాణ సంస్థతో చర్చించి... సినిమా నుంచి వైదొలిగారు. అన్నట్టు... 'పుష్ప 2'ను నిర్మిస్తున్నది కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే.


కొత్త హీరోయిన్ వేటలో వెంకీ కుడుముల!
దర్శకుడు వెంకీ కుడుములకు రష్మిక ఫ్రెండ్ కూడా! అయితే... ఆమె ఎంత బిజీగా ఉన్నదీ అతనికీ తెలుసు. ఆ విషయాన్ని అర్థం చేసుకుని, ఇప్పుడు కొత్త హీరోయిన్ వేటలో పడ్డారు. నితిన్ జోడీగా ఇప్పుడు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. 



జీవీ ప్రకాష్ హీరో సంగీతంలో!
నితిన్, వెంకీ కుడుముల సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీత దర్శకుడు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. 'భీష్మ' సినిమా విడుదలైన మూడేళ్లకు వెంకీ కుడుముల సినిమా పట్టాలు ఎక్కుతోంది.


నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి  సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్, కళా దర్శకత్వం : రామ్ కుమార్, నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్,  రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల.


Also Read  విస్కీ పూరితో వెరైటీ మాస్ ఇంట్రో - శివన్న కూడా ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే!








ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial