Allu Aravind: దర్శకుడు సాయి రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘బేబీ’ . ఈ సినిమాలో ఆందర్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్ లు మంచి పాజిటివ్ టాక్ ను అందుకున్నాయి. జులై 14 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇటీవలే మూవీ కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మూవీ టీమ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


నేను అప్పుడే విజయ్ కు ఫోన్ చేసి చెప్పాను: అల్లు అరవింద్


‘బేబీ’ సినిమా చాలా బాగా వచ్చిందని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. దర్శకుడు సాయి రాజేష్ మంచి ఎమోషన్స్ ఉన్న సినిమాను తెరకెక్కించారని చెప్పారు. తాను మూవీకు సంబంధించి కొన్ని రఫ్ సీన్స్ చూశానని ఇది కచ్చితంగా ఒక కల్ట్ సినిమా అవుతుందని అప్పుడే అనిపించిందని కితాబిచ్చారు.  ఇక సినిమాలో పాటలు కూడా చాలా బాగా వచ్చాయని అన్నారు. ముఖ్యంగా తాను సినిమా రష్ సీన్స్ చూసినపుడు అందులో ఆనంద్ దేవరకొండ బాగా నటించాడని, తనలో మంచి నటుడు ఉన్నాడని ఈ సినిమా ద్వారా తెలుస్తుందని చెప్పారు. అందుకే తాను రష్ సీన్స్ చూసిన వెంటనే విజయ్ దేవరకొండకు ఫోన్ చేసి ‘మీ తమ్ముడు ఇరగదీశాడు’ అని అప్పుడే చెప్పానని అన్నారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా చాలా బాగా నటించిందని పేర్కొన్నారు. ఈ మూవీకి పని చేసిన అందరు టెక్నీషియన్లు ఏదొక రూపంలో గీతా ఆర్ట్స్ తో రిలేషన్ ఉన్నవారేనని, అలాంటి వారంతా కలసి ‘బేబీ’ లాంటి ఒక మంచి సినిమా చేయడం సంతోషంగా ఉందన్నారు.


నేనేదో సరదాగా అంటే ఆ అమ్మాయి మా వాడినే ప్రేమించింది: అల్లు అరవింద్


ఇక ‘బేబీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ మూవీ హీరోయిన్ పై ఫన్నీ కామెంట్స్ చేశారు. యాంకర్ మూవీలో హీరోయిన్ పాత్ర గురించి చెప్పమని అడగ్గా.. ఈ సినిమాను ఇన్పిరేషన్ గా తీసుకొని పెళ్లి చేసుకోవద్దు అంటూ వైష్ణవి చైతన్యపై ఫన్నీ కామెంట్స్ చేశారు. తనకు ఇంకా మంచి భవిష్యత్ ఉందని, కెరీర్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అన్నారు. తాను ఇలాగే తన బ్యానర్ లో మూడు సినిమాలు చేసిన ఓ హీరోయిన్ ను ఇక్కడే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమంటే ఆమె మా వాడినే లవ్ చేసిందని వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి సరదాగా చెప్పుకొచ్చారు అరవింద్. దీంతో స్టేజీపై నవ్వులు విరిసాయి. ఇక ఈ సినిమా జులై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఆనంద్ విజయ్ కు వైష్ణవి చైతన్య కు ఎలాంటి హిట్ అందుతుందో చూడాలి. 


Also Read: జీఎస్టీ కట్ - సినిమా హాల్లో కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ ధరలు తగ్గుతాయట, కానీ చిన్న ట్విస్ట్!