తెలంగాణపై బొత్స షాకింగ్ కామెంట్స్


తెలంగాణలో పరీక్షలు జరుగుతున్న విధానంపై ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ వ్యవహారాలు రోజూ పేపర్‌లో చూస్తున్నామని వారితో ఎలాంటి పోలిక వద్దంటూ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరుగున్న ఇంజినీరింగ్ ప్రవేశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన బొత్స ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రవేశాలు పూర్తైన తర్వాత ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ డేట్స్ ఇస్తామన్నారు బొత్స సత్యనారాయణ. ఇంకా చదవండి


వైసీపీపై పురందేశ్వరి ఎటాక్ !


ఆంధ్రప్రదేశ్ లో భారీ లిక్కర్ స్కాం జరుగుతోందని ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌పై ఘాటు విమర్శలు చేశారు. నాణ్యత లేని బ్రాండ్లను విక్రయిస్తున్న సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తోందని .. మద్యం అమ్మకాల్లో 25శాతానికి బిల్లులే ఉండటం లేదన్నారు. ఇసుక లోడ్ కొనాలంటే రూ.40 వేలని.. ఇసుక ద్వారా జరుగుతున్న అవినీతిని ఒక సంస్ధకు కేటాయిస్తూ దోచుకున్నారని మండిపడ్డారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో నడుస్తోందన్నారు. ఇంకా చదవండి


సడెన్ హార్ట్‌ ఎటాక్స్‌పై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం


ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ముఖ్యంగా యువకులు గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ, కాలేజీలో నడుస్తూ, చదువుకుంటూ, స్నానం చేస్తూ  అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో గుండెపోటు, హార్ట్ ఎటాక్ అని టైప్ చూస్తే వేలల్లో ఇలాంటి వీడియోలు దర్శనం ఇస్తాయి. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారే గుండె ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించేవారు. కానీ  ఇప్పుడు చిన్న పిల్లలు, యువత కూడా గుండె జబ్బుల ప్రమాదంలో పడింది. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు బడుల విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇంకా చదవండి


బొత్సకు తెలంగాణ మంత్రుల ఘాటు కౌంటర్


తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదం అవుతున్నాయి. తెలంగాణ మంత్రులు బొత్స సత్యనారాయణ తీరుపై మండి పడుతున్నారు.  ముందు తమ రాష్ట్రం సంగతి చూసుకోవాలని.. అక్కడ చేసిన నిర్వాకాలు చాలవా అని ప్రశ్నిస్తున్నారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని..  ఏ రాష్ట్రం ఎంత అభివృద్ది చెందుతుందో ప్రజలకు తెలుసునని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఇంకా చదవండి


వాలంటీర్లను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై కేసు


వారాహి రెండో విడత యాత్రలో వాలంటీర్ల వ్యవస్థను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ టార్గెట్ చేశారు. ఆ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని కొందరు వాలంటీర్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు చేశారు. దీనిపై వైసీపీ భగ్గుమంది. చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు అయింది. ఇంకా చదవండి