తెలంగాణ పరీక్షల విధానం బొత్స షాకింగ్ కామెంట్స్- ఏం జరుగుతందో పేపర్లు చూస్తున్నామని చురకలు
తెలంగాణలో పరీక్షలు జరుగుతున్న విధానంపై ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ వ్యవహారాలు రోజూ పేపర్‌లో చూస్తున్నామని వారితో ఎలాంటి పోలిక వద్దంటూ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరుగున్న ఇంజినీరింగ్ ప్రవేశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన బొత్స ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అన్ని ప్రవేశాలు పూర్తైన తర్వాత ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ డేట్స్ ఇస్తామన్నారు బొత్స సత్యనారాయణ... తెలంగాణలో పరీక్షలు నిర్వహణ కూడా సరిగా లేదన్నారు. తెలంగాణ అడ్మిషన్ల సంగతి రోజూ పేపర్లో చూస్తున్నామన్నారు. ఆఫ్ర్టాల్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్సే ఎలా జరిగాయో చూస్తున్నామంటూ విమర్సలు చేశారు. ఎంత చూచిరాతలు, ఎన్ని స్కామ్‌లు, ఎంతమంది అరెస్టు అయ్యారో తెలుస్తోందన్నారు.
తెలంగాణలో ఆగిపోయిన ఉపాధ్యాయుల బదిలీలపై కూడా బొత్స కామెంట్స్ చేశారు. టీచర్స్ ట్రాన్సఫర్సే తెలంగాణ వాళ్లు చేసుకోలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అందుకే ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రాన్ని కంపేర్ చేయొద్దని మీడియాకు సూచించారు. ఎవరి విధానం వారికి ఉంటుందన్నారు. ఎవరి ఆలోచన వారిదన్నారు. ఎవరి లైన్ వాళ్లదని... ఎవరిపైనా కామెంట్స్ చేయడం లేదంటూనే సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న విద్యా విదానం దేశంలో చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు బొత్స. చాలా రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయన్నారు. సీఎం జగన్ తీసుకుంటున్న స్టెప్స్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలను అంతా చూస్తున్నారని తెలిపారు. కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలను ఏపీలోనే మొదట అమలు చేస్తున్నామన్నారు. ఇక్కడ చేపడుతున్న విధానాలపై ఇతర్రాష్ట్రాలు వచ్చి చూస్తున్న విషయం అందరికీ తెలుసన్నారు.
విద్య, హెల్త్, వ్యవసాయం, సంక్షేం తమ ప్రభుత్వానికిప్రాధాన్యత అంశాలని బొత్స వివరించారు. వాటిలో విద్యకు టాప్ ప్రయార్టీ ఉంటుందన్నారు. ఎప్పుడూ కనీవిని ఎరుగని విధంగా విద్యపై ఖర్చు పెడుతున్నామని పేర్కొన్నారు. ఎవరు ఏ అంశం గురించి చెప్పిన అందులో మంచిని తీసుకొని అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థుల గ్లోబల్ కాంపిటేషన్‌లో నిలబడాలని గట్టి ఫౌండేషన్ వేస్తున్నామని తెలిపారు.