సముద్రాన్ని రక్తంతో నింపేసిన తారక్ - ‘దేవర’ గ్లింప్స్ చూశారా?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘దేవర’. కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ‘దేవర’ను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ‘దేవర’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ రివీల్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఏజెంట్' - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అక్కినేని అఖిల్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది ఈ యంగ్ హీరో నటించిన 'ఏజెంట్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అఖిల్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. ఏజెంట్ ఓటీటీ రిలీజ్ విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని, రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఈ మూవీ ఓటీటీ లోకి రానుందని సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ లో ఏజెంట్ జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
చిరుత వేట అలాగే ఉంటుంది - 'OG' ఎప్పటికీ మాదే, ఆ వీడియోతో పుకార్లకు చెక్ పెట్టిన మేకర్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య రాజకీయాల కారణంగా తన సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన 'ఉస్తాద్ భగత్ సింగ్', 'OG', 'హరిహర వీరమల్లు' వంటి వరుస సినిమాలు చేస్తున్నారు. వీటిలో పవన్ ఫ్యాన్స్ 'OG' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై తాజాగా ఓ రూమర్ సోషల్ మీడియా అంతా వైరల్ అయింది. అదేంటంటే, ఈ సినిమా నిర్మాత చేతులు మారుతుంది అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. OG సినిమాని నిర్మిస్తున్న డివివి దానయ్య ఈ మూవీని పీపుల్స్ మీడియా వాళ్లకు ఇచ్చేస్తున్నారని సోషల్ మీడియా అంతటా పుకార్లు వినిపించాయి. ఇక 'OG' పై వచ్చిన ఈ రూమర్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తూ DVV ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రూ.600 కోట్ల క్లబ్‌లో చేరిన 'సలార్' - ప్రభాస్ ఖాతాలో ఇది మూడోది!
డిసెంబర్ 22న రిలీజ్ అయిన ‘సలార్’ తాజాగా థర్డ్ వీకెండ్ ని ముగించుకుంది. సంక్రాంతి వరకు పెద్దగా కొత్త సినిమాల రిలీజ్ లేకపోవడంతో ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మూడో వారంతం ముగించుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రూ.600 కోట్ల గ్రాస్ మార్క్ దాటింది. సలార్ రిలీజైన మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన అందుకుంది. అయితే సినిమాలో యాక్షన్ లవర్స్ ని మెప్పించే అంశాలు ఉండడంతో భారీ కలెక్షన్స్ వచ్చాయి. పాన్ ఇండియా స్థాయిలో మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి తెలుగు, హిందీ(డబ్బింగ్ వెర్షన్)లో మాత్రమే భారీ ఆదరణ లభించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘యూఐ’ టీజర్ - కొత్త ప్రపంచాన్ని సృష్టించిన ఉపేంద్ర, చూస్తే మీరే షాకవుతారు!
కన్నడలో సీనియర్ హీరో అయిన ఉపేంద్ర.. గతకొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. అందరు ఒక ఫార్మాట్‌లో సినిమాలు చేస్తూ వెళ్లినా.. తను మాత్రం ఆ ఫార్మాట్ ఫాలో అవ్వకుండా డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నించేవారు ఉపేంద్ర. ఇక చాలాకాలం ‘యూఐ’ అనే పేరుతో ఒక కొత్త సినిమాలో నటించడంతో పాటు దానిని తానే డైరెక్ట్ చేశారు కూడా. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసింది. ఇక తాజాగా దీనికి సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ చివర్లో ఉపేంద్ర లుక్ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)