యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘దేవర’. కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ‘దేవర’ను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ‘దేవర’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ రివీల్ చేశారు.


ఈ గ్లింప్స్ విషయానికి వస్తే... ఇందులో సినిమా స్కేల్‌ను పరిచయం చేశారు. వీఎఫ్ఎక్స్ పరంగా ‘దేవర’ టాప్ నాచ్ పరంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ టెర్రిఫిక్‌గా ఉన్నారు. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ల గత చిత్రాలతో పోలిస్తే ఇందులో వయొలెన్స్ కాస్త ఎక్కువగానే ఉంది. కానీ ప్రేక్షకుల్లో ఎవరెస్ట్ లెవల్ అంచనాలు క్రియేట్ చేయడంలో మాత్రం మేకర్స్ సక్సెస్ అయ్యారు.


సముద్రంలో కంటైనర్లతో ఉన్న నౌక ఉండటం, దాని మీదకు కొందరు ఎక్కి కంటైనర్లు సముద్రంలో దించేయడంతో గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. అందులోకి కొందరు మనుషులు దూకాక సముద్రం ఎర్రగా మారుతుంది. ఆ వెంటనే సముద్రం ఒడ్డున తారక్ యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. ఈ సీక్వెన్స్‌లో వచ్చే బ్లడ్ మూన్ షాట్ మొత్తం గ్లింప్స్‌కే హైలెట్. ఎర్ర సముద్రం నేపథ్యంలో ఈ సినిమా కథ జరగనుందని తారక్ డైలాగ్‌ను బట్టి చెప్పవచ్చు. ‘ఈ సముద్రం చేపల కంటే కత్తులను, నెత్తురునే ఎక్కువ చూసుండాది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు.’ అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కూడా ఈ గ్లింప్స్‌లో ఉంది.



థియేటర్లలో కూడా...
2024 సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఈ సినిమాలకు ‘దేవర’ గ్లింప్స్‌ను అటాచ్ చేయనున్నారట. దీనికి సంబంధించిన  దీంతో సంక్రాంతి సినిమాల కోసం థియేటర్లకు వచ్చిన వారికి ‘దేవర’ గ్లింప్స్ డబుల్ ట్రీట్ ఇవ్వనుంది. సంక్రాంతి సినిమాల్లో ‘గుంటూరు కారం’ ‘హనుమాన్’లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


ఇక ‘దేవర’ విషయానికొస్తే... ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ వచ్చింది. ఈ మూవీ కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ను సాధించింది. రిలీజ్ అయిన సమయంలో టాలీవుడ్ టాప్-3 వసూళ్లు సాధించిన సినిమాలో నిలిచింది. మెసేజ్ ఓరియెంటెడ్ కథలకు కమర్షియల్ టచ్‌ ఇచ్చి సినిమాలను బ్లాక్ బస్టర్ చేయడంలో కొరటాల శివ నిపుణుడు. కొరటాల తెరకెక్కించిన మొదటి నాలుగు సినిమాలూ బ్లాక్‌బస్టర్లే. కానీ చిరంజీవితో తెరకెక్కించిన ‘ఆచార్య’తో మొదటి ఫ్లాప్‌ను అందుకున్నారు కొరటాల.


‘దేవర’తో ఎలాగైనా తిరిగి సక్సెస్‌లోకి రావాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదుగుతున్న జాన్వీ ఈ సినిమాతో తెలుగులో డెబ్యూ ఇవ్వనుంది. ఇక విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. రెండు భాగాలుగా ‘దేవర’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మొదటి భాగం 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది. రెండో భాగం గురించి మేకర్స్ ఇంతవరకు ఏమీ వెల్లడించలేదు.