Hindupuram Peddireddy Ramachandra Reddy : హిందూపురం నియోజకవర్గంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏకంగా ఆరు రోజుల పాటు నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ నేతలను ఏకం చేయడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే వారు ఎవరైనా ఉంటే చేర్చుకోనున్నారు. ఆరు రోజుల పాటు హిందూపూర్ నియోజకవర్గం పరిధిలోని 36 పంచాయతీల్లో పర్యటించనున్నారు. మొదటి రోజు చౌళూరు, తూముకుంట, గోళ్లాపురం, సంతేబిదనూరు, కోటిపి, కిరికెర, బేవినహళ్ళి పంచాయతీలో మంత్రి పర్యటన సాగుతుంది. చౌళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దిరెడ్డి మాట్లాడారు.
బీసీలకు జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి
ఆరు రోజులపాటు నియోజవర్గం లో పర్యటిస్తానని.. ఎన్ని సార్లు హిందూపూర్ ప్రజలు ఒకే పార్టీని గెలిపించినా హిందూపూర్ ఏమి అభివృద్ధి చెందిందని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. బిసిలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. బిసి మహిళలను హిందూపూర్ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలు గా నియమించారన్నారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా పెన్షన్ మూడు వేలు చేశామన్నారు. బటన్లు నొక్కుతారు కానీ డబ్బులు ఇవ్వరు అని టిడిపి వారి విష ప్రచారం చేస్తున్నారని డబ్బులు అకౌంట్ లో వేయడం ఏ రోజు ఆలస్యం కాలేదన్నారు. తన 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఈ స్థాయిలో హామీలు అమలు చేసిన వారిని చూడలేదని చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వైఎస్ జగన్ ను ఆదరించాలా ? లేదా హామీలను మర్చిపోయే చంద్రబాబు చేతిలో మోసపోవాల అనేది ప్రజలు ఆలోచించాలన పిలుపునిచ్చారు.
పందెం కోళ్లకు వయాగ్రా- సంక్రాంతి బరిలో గెలించేందుకు ప్రమాదకర ఆహారం పెడుతున్న యజమానులు
టీడీపీ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకూ హిందూపురంలో గెలవని మరో పార్టీ
హిందూపురం టీడీపీ కంచుకోటగా ఉంది. ఎలాగైనా ఈ సారి వైసీపీని గెలిపించాలన్న బాధ్యతను సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. ఆరు రోజుల పాటు నియోజకవర్గంలో పట్టణం నుంచి పంచాయితీ వరకు కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరినీ కలవనున్నారు. మండలానికి రెండు రోజుల చొప్పున కేటాయించి ఆరు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గత 20 రోజుల నుంచి మంత్రి వ్యక్తిగత కార్యదర్శి తో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు నియోజకవర్గంలో ఉన్న నేతలందరినీ కలిశారు. ఇటీవల దీపికారెడ్డి అనే నేతను ఇంచార్జుగా పెట్టారు. కానీ ఆమె పనితీరుపై నమ్మకం కుదరలేదు. దీంతో అందరితో మాట్లాడి పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు పెద్దిరెడ్డి ఆరు రోజులు మకాం వేస్తున్నారు.
సింగనమల ఎమ్మెల్యే తిరుగుబాటు- నియోజకవర్గానికి నీళ్ల కోసం పోరుబాట
ప్రస్తుత ఇంచార్జ్ దీపికకు టిక్కెట్ కష్టమేనా ?
నవీన్ నిశ్చల్ తో పాటు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ప్రస్తుత సమన్వయకర్త దీపిక అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్ బలరాం రెడ్డి కూడా టికెట్ కోసం తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రస్తుత మంత్రి ఉషశ్రీ చరణ్ పోటీ చేస్తున్నట్లు స్పష్టం కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త దీపికకు ఇవ్వరని భావిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కూడా దీపికను గెలిపించాలని కోరడంలేదు. నందమూరి బాలకృష్ణకు ఎవరు గట్టి పోటీ ఇస్తారన్న కోణంలో కూడా తాజాగా సర్వే చేస్తున్నారు. పెద్దిరెడ్డి ఏకంగా ఆరు రోజుల పాటు మకాం వేయాలని నిర్ణయించడంతో బాలకృష్ణ ముందుగానే నియోజకవర్గానికి వచ్చారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు హిందూపురం పురపాలక సంఘం, రూరల్ మండల వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.