Guntur Kaaram Trailer : సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'గుంటూరు కారం' ట్రైలర్ ని ఆదివారం రాత్రి 9 గంటల 15 నిమిషాల ప్రాంతంలో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ తో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ట్రైలర్ లో మహేష్ ఊర మాస్ లుక్, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్, ఆడియన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉన్నాయి. మాస్ సెలివెంట్స్, ఎంటర్టైన్మెంట్ స్టఫ్, పంచ్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ అన్ని కలిగలిపి 'గుంటూరు కారం' తో ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు భారీ వినోదాన్ని అందించబోతున్నారు త్రివిక్రమ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'గుంటూరు కారం' ట్రైలర్ దూసుకుపోతుంది యూట్యూబ్ లో ఇప్పటికే 19మిలియన్లకి పైగా వ్యూస్ అందుకుంది.
నిజానికి ట్రైలర్ ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. కానీ రిలీజ్ టైం మాత్రం ప్రకటించలేదు. సాయంత్రం రిలీజ్ చేస్తారు అనుకున్న ట్రైలర్ ను ఆలస్యంగా రాత్రి 9 గంటల తర్వాత రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ ఆలస్యం అవడానికి ఓ కారణం ఉందట. అందుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే, 'గుంటూరు కారం' ట్రైలర్ ని మొదటగా చూసిన మహేష్ బాబు మార్చి కొంత మాడిఫై చేయించి కట్ చేయించారట. లేటెస్ట్ ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. మొదట మూవీ టీం ఈ సినిమాకి ఓ ట్రైలర్ కట్ చేశారు. ఆ ట్రైలర్ లో మరిన్ని ఎమోషనల్ మూమెంట్స్ తో పాటు కొన్ని సర్ప్రైజ్ కూడా ఉన్నాయి.
దాంతో ట్రైలర్ చూసిన మహేష్ బాబు అప్పుడే ఏ సర్ప్రైజ్ లు రివీల్ చేయవద్దని, ఎమోషనల్ కంటెంట్ ని హైలైట్ చేయవద్దని, థియేటర్స్ లో రిలీజ్ అయ్యే వరకు దాచి పెట్టమని చెప్పారట. దాంతో ఆ ట్రైలర్ ని పక్కన పెట్టి మరో ట్రైలర్ కట్ చేశారట. అందుకే ట్రైలర్ రిలీజ్ ఆలస్యమైందట. అలా హడావుడిగా మరో ట్రైలర్ కట్ చేయడంతో లేటెస్ట్ ట్రైలర్ లో సౌండ్ మిక్సింగ్ ప్రాబ్లమ్స్ చూసుకోకపోవడం వల్ల టీవీల్లో ఈ ట్రైలర్ ఆడియో సరిగ్గా వినపడలేదు. మరి ఆడియన్స్, ఫ్యాన్స్ కోసం ఈ సినిమాలో ఇంకెలాంటి సర్ప్రైజ్ లను దాచారో తెలియాలంటే జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే.
అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేష్ - త్రివిక్రమ్ చేస్తున్న సినిమా కావడంతో 'గుంటూరు కారం' పై ఓ రేంజ్ లో అంచాలలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతిబాబు, ఈశ్వరి రావు, రఘుబాబు, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో పోషిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read :చిక్కుల్లో ‘అన్నపూర్ణి’ మూవీ - నయనతారపై కేసు నమోదు