Agent OTT Release : అక్కినేని అఖిల్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది ఈ యంగ్ హీరో నటించిన 'ఏజెంట్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అఖిల్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టారు. అఖిల్ కూడా ఎంతో కష్టపడ్డాడు సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడి డైట్ మైంటైన్ చేసి బీస్ట్ మోడ్ లో బాడీని పెంచాడు. సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. చివరికి ఏజెంట్ అఖిల్ కి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఏజెంట్ రిజల్ట్ తో ఫుల్ డిసప్పాయింట్ అయిన అఖిల్ కొద్దిరోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
ఇప్పటివరకు నెక్స్ట్ మూవీని కూడా ప్రకటించలేదు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే గత ఏడాది ఏప్రిల్ నెలలో థియేటర్స్ లోకి వచ్చిన 'ఏజెంట్' ఇప్పటిదాకా ఓటీటీ రిలీజ్ కి నోచుకోలేదు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే విపరీతమైన నెగిటివ్ టాక్ రావడంతో చాలామంది ఆడియన్స్ థియేటర్లో సినిమాని చూడలేదు. దాంతో ఓటీటీలోకి వస్తే చూద్దామని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. ఏజెంట్ ఓటీటీ రిలీజ్ విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని, రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఈ మూవీ ఓటీటీ లోకి రానుందని సమాచారం.
ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ లో ఏజెంట్ జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సోనీ లీవ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆమధ్య ఓటీటీ వెర్షన్ కోసం మూవీ టీమ్ బెటర్ అవుట్ ఫుట్ ని ప్లాన్ చేస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. అంటే థియేటర్ వెర్షన్ కాకుండా ఓటీటీ కోసం మరో వెర్షన్ ని రిలీజ్ చేస్తామని అన్నారు. మరి ఇప్పుడు జనవరి 26 నుంచి ఏజెంట్ ఓటీటీలోకి థియేటర్ వెర్షన్ తో వస్తుందా? లేక న్యూ వెర్షన్ తో వస్తుందా? అనేది చూడాలి. వక్కంతం వంశీ రైటర్ గా పని చేసిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.
సాక్షి వైద్య ఈ మూవీతో హీరోయిన్గా తెలుగు వెండితెరకు పరిచయమైంది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఇక ఏజెంట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత UV క్రియేషన్స్ సంస్థ అఖిల్ తో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీనికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'సాహో' చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ సింగ్ లో జరుగుతున్న ఈ ప్రాజెక్టు కోసం ఏవి నిర్మాతలు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
Also Read : చిరుత వేట అలాగే ఉంటుంది - 'OG' ఎప్పటికీ మాదే, ఆ వీడియోతో పుకార్లకు చెక్ పెట్టిన మేకర్స్!