'లియో' డైరెక్టర్‌కు ఊహించని షాక్ - లోకేష్ మానసిక స్థితిపై హైకోర్టులో పిటీషన్
సౌత్ పాన్ ఇండియా డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా 'లియో' మూవీతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు 'విక్రమ్' తో కోలీవుడ్లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ 'లియో' తో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది కోలీవుడ్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.550 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మిక్స్డ్ టాక్ తోనే ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి ఇంకా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
గుంటూరు కారం vs హనుమాన్ - వీటిలో దేనికి ఎక్కువ క్రేజో తెలుసా? ఇదిగో ‘బుక్ మై షో’ రిజల్ట్!
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ జరగబోతోంది. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిల్లో స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాలు అలాగే ఓ యంగ్ హీరో సినిమా కూడా ఉంది. ఈ పొంగల్ కి గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామిరంగ వంటి సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. వీటన్నింటిలో ఇప్పటివరకు చూసుకుంటే మహేష్ 'గుంటూరు కారం' సినిమాపైనే అందరి దృష్టి ఉంది. ఇటు ఆడియన్స్ లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ పండక్కి పెద్ద సినిమా ఏదంటే అందరూ 'గుంటూరు కారం' అని, ఆడియన్స్ అంతా ఆ సినిమాను చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనే టాక్ వినిపించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేస్తోంది - గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎప్పుడంటే?
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' మూవీ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై విపరీతమైన హైప్ పెంచేశారు మేకర్స్. ముఖ్యంగా ఇటీవల రిలీజైన 'కుర్చీ మడతపెట్టి' మాస్ సాంగ్ సినిమాపై అంచనాలను పీక్స్ కి తీసుకెళ్లింది. ఈ పాటలో మహేష్, శ్రీలీలా ఊర మాస్ స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు. గతంలో ఎన్నడు లేనంతగా మహేష్ ఈ సినిమాలో మాస్ డాన్స్ తో అదరగొట్టేసారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
90 పర్సెంట్ @ 35 డేస్ - కాజల్ స్పీడ్ మామూలుగా లేదు
తెలుగు ప్రేక్షకులు చందమామ అని ముద్దుగా పిలుచుకునే హీరోయిన్ కాజల్ అగర్వాల్. కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్లు చేశారామె. అలాగే, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు కూడా చేశారు. కానీ, ఇప్పుడు ఆవిడ రూట్ మార్చినట్లు అర్థం అవుతోంది. యాక్షన్, ఫిమేల్ ఓరియెంటెడ్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సత్యభామ' షూటింగ్ కొన్ని రోజుల ముందు మొదలైంది. నవంబర్, డిసెంబర్ నెలలో శరవేగంగా చిత్రీకరణ జరిగింది. 35 రోజుల పాటు సాగిన షెడ్యూల్‌తో 90 శాతం సినిమా పూర్తి చేశామని నిర్మాతలు తెలిపారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్ నాన్న’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
గతేడాది డిసెంబర్‌లో విడుదలయిన అన్ని సినిమాలు దాదాపుగా సూపర్ హిట్‌ను సాధించాయి. అన్ని కమర్షియల్ సినిమాల మధ్య ‘హాయ్ నాన్న’ అనే ఫీల్ గుడ్ మూవీతో వచ్చి బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ మూవీని థియేటర్లలో ఒకసారి చూసి తృప్తి చెందని ప్రేక్షకులు... మళ్లీ మళ్లీ దీని కోసం థియేటర్లకు వెళ్లారు. ఇక ఓటీటీలోకి కూడా ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఫైనల్‌గా ‘హాయ్ నాన్న’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)