HanuMan Movie : ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ జరగబోతోంది. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిల్లో స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాలు అలాగే ఓ యంగ్ హీరో సినిమా కూడా ఉంది. ఈ పొంగల్ కి గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామిరంగ వంటి సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. వీటన్నింటిలో ఇప్పటివరకు చూసుకుంటే మహేష్ 'గుంటూరు కారం' సినిమాపైనే అందరి దృష్టి ఉంది. ఇటు ఆడియన్స్ లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ పండక్కి పెద్ద సినిమా ఏదంటే అందరూ 'గుంటూరు కారం' అని, ఆడియన్స్ అంతా ఆ సినిమాను చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనే టాక్ వినిపించింది.


కానీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ మాత్రం 'గుంటూరు కారం'పై కాకుండా వేరే సినిమాపై ఉందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని బుక్ మై షో వెబ్ సైట్ బయట పెట్టింది. ప్రముఖ ఆన్ లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షో లెక్కల ప్రకారం ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల్లో 'హనుమాన్'పై  ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. బుక్ మై షో లో 'హనుమాన్' హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ని కలిగి ఉంది. ఈ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ లో 'హనుమాన్' సినిమాకి ఏకంగా 169.5K ఇంట్రెస్ట్ ని చూపించారు. తర్వాత 'గుంటూరు కారం' 168.7K మందితో రెండో స్థానంలో ఉంది.


ఇక సంక్రాంతి సినిమాల్లో విక్టరీ వెంకటేష్ నటించిన 'సైంధవ' సినిమా కోసం 63K ఇంట్రెస్ట్ చూపించగా నాగార్జున 'నా సామిరంగా' కోసం 41K ఆసక్తి చూపారు. రవితేజ ఈగల్ 18.2K ఇంట్రెస్ట్ తో లాస్ట్ ప్లేస్ లో ఉండటం గమనార్హం అయితే సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాల్లో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కలయికలో తెరకెక్కిన 'హనుమాన్'పై ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని చూపించడం విశేషం. 'గుంటూరు కారం' కంటే 'హనుమాన్' పైనే ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపించడానికి కారణం ముందు నుంచే ‘హనుమాన్’పై భారీ అంచనాలు ఉండటమే.


నిజానికి ‘హనుమాన్’ ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా. తక్కువ బడ్జెట్ లోనే భారీ గ్రాఫిక్స్, VFX క్వాలిటీ పరంగానూ మూవీ టీమ్ నుంచి బ్రిలియంట్ వర్క్ కనిపించింది. ఓ చిన్న సినిమాలో హాలీవుడ్ స్టాండర్డ్స్ టెక్నికల్ వర్క్ కనిపించడంతో సహజంగానే ‘హనుమాన్’ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. మరి జనవరి 12న రిలీజ్ అవుతున్న 'హనుమాన్' అదే రోజు రిలీజ్ అవుతున్న 'గుంటూరు కారం' కలెక్షన్స్ ని ఎంతవరకు మ్యాచ్ చేస్తుందో చూడాలి.


Also Read : ‘సైంధవ్’ ట్రైలర్‌లో బులెట్ షాట్‌పై ట్రోల్స్ - వివరణ ఇచ్చిన డైరెక్టర్ శైలేష్