Guntur Kaaram Actress Meenakshi Chaudhary First Look: 'గుంటూరు కారం'లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అయితే... ఇప్పటి వరకు శ్రీ లీల మాత్రమే హైలైట్ అవుతూ వచ్చారు. 'కుర్చీ మడతపెట్టి...' పాట గానీ, అంతకు ముందు వచ్చిన 'ఓ మై బేబీ'లో గానీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు ఆమె స్టెప్పులు వేశారు. సినిమాలో శ్రీ లీలతో పాటు మరొక హీరోయిన్ కూడా ఉన్నారు. ఇవాళ ఆమె లుక్ విడుదల చేశారు.


రాజీ పాత్రలో మీనాక్షి చౌదరి
'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబు సరసన మరొక కథానాయికగా మీనాక్షి చౌదరి నటించారు. ఇవాళ ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రాజీ పాత్రలో ఆమె నటిస్తున్నట్లు తెలిపారు. రమణ పాత్రలో మహేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రమణతో రాజీ అంటూ లుక్ విడుదల చేశారు.


Also Read: ఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే






ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ విడుదల ఆ రోజే
Guntur Kaaram Pre Release Event Date: 'గుంటూరు కారం' సినిమా ఈ నెల 12న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ శనివారం (6న తేదీన) హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. అందులో ట్రైలర్ విడుదల చేయనున్నారు. 


Also Readపెళ్లికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా? 






ఇక, సాంగ్స్ విషయానికి వస్తే... 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ వైరల్ కావడంతో సినిమాకు మంచి పబ్లిసిటీ లభించింది. ఆ పాటలో తప్పు ఏముందని కొందరు... మహేష్, త్రివిక్రమ్ వంటి స్టార్స్ ఆ సాంగ్ చేయకుండా ఉండాల్సిందని మరికొందరు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సినిమాపై ఘట్టమనేని అభిమానులు, ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.


Also Readతండ్రికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చి పిల్లను పడేశాడు - ఆమిర్ ఖాన్ అల్లుడి బ్యాగ్రౌండ్ తెలుసా?


'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్ బాబు, మాటల మాంత్రికుడు & గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. 'అరవింద సమేత వీర రాఘవ', 'అల వైకుంఠపురములో' సినిమాల తర్వాత త్రివిక్రమ్, తమన్ కలయికలో తాజా చిత్రమిది.