Trains Cancelled in Vijayawada Division: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. విజయవాడ (Vijayawada) డివిజన్ లో నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 15 నుంచి కొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడం సహా, ఇంకొన్నింటిని దారి మళ్లించింది. ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.
రద్దైన రైళ్లు ఇవే
- ఈ నెల 19, 20, 22, 23, 24, 26, 27 తేదీల్లో విజయవాడ - విశాఖపట్నం (రైలు నెం: 22702/22701) రైలు రద్దు
- ఈ నెల 19 నుంచి 28 వరకూ గుంటూరు - విశాఖపట్నం (రైలు నెం: 17239) రైలు రద్దు
- విశాఖ - గుంటూరు (రైలు నెం: 17240) రైలు సర్వీస్ ఈ నెల 20 నుంచి 29 వరకూ రద్దు
- ఈ నెల 19 నుంచి 28 వరకూ బిట్రగుంట - విజయవాడ (రైలు నెం: 07977/07978) రైలు రద్దు
- బిట్రగుంట - చెన్నై సెంట్రల్ (17237/17238) రైలు ఈ నెల 22 నుంచి 26 వరకు రద్దు.
పాక్షికంగా రద్దైన రైళ్ల వివరాలు
ఈ నెల 15 నుంచి 28 వరకూ మచిలీపట్నం - విజయవాడ (07896/07769), నర్సాపూర్ - విజయవాడ (07863/07866), మచిలీపట్నం - విజయవాడ (07770), విజయవాడ - భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్నం - విజయవాడ (07870), విజయవాడ - నర్సాపూర్ (07861) రైళ్లను రెండు మార్గాల్లో పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ రైళ్లు దారి మళ్లింపు
- ఈ నెల 15, 22 తేదీల్లో ఎర్నాకుళం - పాట్నా (22643) రైలును దారి మళ్లించారు
- ఈ నెల 20, 29 తేదీల్లో భావ్ నగర్ - కాకినాడ టౌన్ (12756) రైలును దారి మళ్లించారు
- ఈ నెల 17, 19, 24, 26 తేదీల్లో బెంగుళూరు గౌహతి (12509) రైలును దారి మళ్లించారు
- ఈ నెల 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినల్ - భువనేశ్వర్ (11019) రైలు దారి మళ్లించారు
- ఈ నెల 15 నుంచి 28 వరకూ ధనబాద్ - అలెప్పి (13351), ఈ నెల 18, 25 తేదీల్లో టాటా యశ్వంత్ పూర్ (18111), ఈ నెల 17, 24 తేదీల్లో జసిదిహ్ - తాంబరం (12376) రైలును దారి మళ్లించారు.
- ఈ నెల 15, 22 తేదీల్లో హథియా - ఎర్నాకుళం (22837), ఈ నెల 15, 20, 24, 27 తేదీల్లో హథియా - బెంగుళూరు (18637) రైలు దారి మళ్లించారు.
- ఈ నెల 16, 21, 23, 28 తేదీల్లో హథియా - బెంగుళూరు (12835) రైలును దారి మళ్లించారు.
- ఈ నెల 19, 26 తేదీల్లో టాటా - బెంగుళూరు (12889) రైలును దారి మళ్లించారు. ఈ రైళ్లన్నీ విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
మరోవైపు, సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లాలనుకునే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 32 ప్రత్యేక రైళ్ల (Pongal Special Trains)ను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. జనవరి 7 నుంచి జనవరి 27 వరకు ఈ స్పెషల్ ట్రెయిన్స్ అందుబాటులో ఉండనున్నాయి. సంక్రాంతి (Sankranti 2024) సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం వేసిన ఈ రైళ్లలో స్లీపర్, జనరల్ బోగీలతో పాటు ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ సీట్లు ఉంటాయని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రత్యేక రైళ్లు ఇవే
- ఈ నెల 7, 14 తేదీల్లో ట్రైన్ నెంబర్ 07089 సికింద్రాబాద్- బ్రహ్మపుర్, 8, 15 తేదీల్లో బ్రహ్మపుర్ - వికారాబాద్ (రైలు నెం: 07090 )
- ఈ నెల 9, 16 తేదీల్లో వికారాబాద్- బ్రహ్మపుర్ (07091), 10, 17 తేదీల్లో బ్రహ్మపుర్ - సికింద్రాబాద్ (07092)
- ఈ నెల 10, 17, 24 తేదీల్లో విశాఖ - కర్నూలు సిటీ (08541), ఈ నెల 11, 18, 25 తేదీల్లో కర్నూలు సిటీ - విశాఖ (08542)
- ఈ నెల 12, 19, 26 తేదీల్లో శ్రీకాకుళం - వికారాబాద్ (08547), ఈ నెల 13, 20, 27 తేదీల్లో వికారాబాద్ - శ్రీకాకుళం (08548)
- ఈ నెల 10, 17 తేదీల్లో సికింద్రాబాద్ - తిరుపతి (02764), ఈ నెల 11, 18 తేదీల్లో తిరుపతి - సికింద్రాబాద్ (02763).
- ఈ నెల 12న సికింద్రాబాద్ - కాకినాడ (07271), 12న కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ (07272)
- ఈ నెల 8, 15 తేదీల్లో సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ (07093), 9, 16 తేదీల్లో బ్రహ్మపూర్ - సికింద్రాబాద్ (07094)
- ఈ నెల 10న నర్సాపూర్ - సికింద్రాబాద్ (0), 11న సికింద్రాబాద్ - నర్సాపూర్ (07052)
- ఈ నెల 10న నర్సాపూర్ - సికింద్రాబాద్ (07251), 11న సికింద్రాబాద్ - నర్సాపూర్ (07252) ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.
రైళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం https://www.irctc.co.in/nget/train-search క్లిక్ చేయండి.
Also Read: Telangana News: అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలం - రేపటి నుంచి యథావిధిగా బస్సులు