SCR Sankranti Special Trains: సికింద్రాబాద్: సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లాలనుకునే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 32 ప్రత్యేక రైళ్ల (Pongal Special Trains)ను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ నిర్ణయంతో సొంత ఊరికి వెళ్లాలనుకునే వారికి ప్రయాణం చేయడానికి ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 7 నుంచి జనవరి 27 వరకు ఈ స్పెషల్ ట్రెయిన్స్ సేవలు అందించనున్నాయి. సంక్రాంతి (Sankranti 2024) సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం వేసిన ఈ రైళ్లలో స్లీపర్, జనరల్ బోగీలతో పాటు ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ సీట్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటనలో తెలిపింది.
రైళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం https://www.irctc.co.in/nget/train-search క్లిక్ చేయండి.
ట్రైన్ నెంబర్ 07089 సికింద్రాబాద్- బ్రహ్మపుర్ - జనవరి 7, 14 తేదీలు
ట్రైన్ నెంబర్ 07090 బ్రహ్మపుర్ - వికారాబాద్ - జనవరి 8, 15 తేదీలు
ట్రైన్ నెంబర్ 07091 వికారాబాద్- బ్రహ్మపుర్ - జనవరి 9, 16 తేదీలు
ట్రైన్ నెంబర్ 07092 బ్రహ్మపుర్ - సికింద్రాబాద్ - జనవరి 10, 17 తేదీలు
ట్రైన్ నెంబర్ 08541 విశాఖ - కర్నూలు సిటీ - జనవరి 10, 17, 24 తేదీలు
ట్రైన్ నెంబర్ 08542 కర్నూలు సిటీ - విశాఖ - జనవరి 11, 18, 25 తేదీలు
ట్రైన్ నెంబర్ 08547 శ్రీకాకుళం - వికారాబాద్ - జనవరి 12, 19, 26 తేదీలు
ట్రైన్ నెంబర్ 08548 వికారాబాద్ - శ్రీకాకుళం - జనవరి 13, 20, 27 తేదీలు
ట్రైన్ నెంబర్ 02764 సికింద్రాబాద్ - తిరుపతి - జనవరి 10, 17 తేదీలు
ట్రైన్ నెంబర్ 02763 తిరుపతి - సికింద్రాబాద్ - జనవరి 11, 18 తేదీలు
ట్రైన్ నెంబర్ 07271 సికింద్రాబాద్ - కాకినాడ - జనవరి 12 తేదీ
ట్రైన్ నెంబర్ 07272 కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ - జనవరి 13 తేదీ
ట్రైన్ నెంబర్ 07093 సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ - జనవరి 8, 15 తేదీలు
ట్రైన్ నెంబర్ 07094 బ్రహ్మపూర్ - సికింద్రాబాద్ - జనవరి 9, 16 తేదీలు
ట్రైన్ నెంబర్ 07251 నర్సాపూర్ - సికింద్రాబాద్ - జనవరి 10 తేదీ
ట్రైన్ నెంబర్ 07052 సికింద్రాబాద్ - నర్సాపూర్ - జనవరి 11 తేదీ