Hi Nanna OTT Release: గతేడాది డిసెంబర్‌లో విడుదలయిన అన్ని సినిమాలు దాదాపుగా సూపర్ హిట్‌ను సాధించాయి. అన్ని కమర్షియల్ సినిమాల మధ్య ‘హాయ్ నాన్న’ అనే ఫీల్ గుడ్ మూవీతో వచ్చి బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ మూవీని థియేటర్లలో ఒకసారి చూసి తృప్తి చెందని ప్రేక్షకులు... మళ్లీ మళ్లీ దీని కోసం థియేటర్లకు వెళ్లారు. ఇక ఓటీటీలోకి కూడా ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఫైనల్‌గా ‘హాయ్ నాన్న’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.


ఫీల్ గుడ్ సినిమాలకే ప్రాధాన్యత..
‘హాయ్ నాన్న’ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. జనవరి 3 అర్థరాత్రి నుండే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ‘హాయ్ నాన్న’కంటే ముందు ‘అంటే సుందరానికీ’ అనే ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఆ మూవీకి ఆశించిన విజయం దక్కలేదు. అయినా కూడా ఫీల్ గుడ్ సినిమాలను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో ‘హాయ్ నాన్న’ను చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ మూవీ విడుదలయిన కొన్నిరోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించి నాని నమ్మకాన్ని నిలబెట్టింది. ‘యానిమల్’ లాంటి సెన్సేషనల్ సినిమా కూడా ‘హాయ్ నాన్న’ రన్‌కు బ్రేకులు వేయలేకపోయాయి.






ఆ ముగ్గురి నటన హైలెట్..
‘హాయ్ నాన్న’ మూవీతో శౌర్యువ్ టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. డెబ్యూ మూవీలోనే ఒక సెన్సిటివ్ కాన్సెప్ట్‌ను తీసుకొని అన్ని ఎమోషన్స్‌ను సమానంగా బ్యాలెన్స్ చేశాడని శౌర్యువ్‌ను ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీకి ప్రాణం పోసింది యాక్టర్ల నటనే. నేచురల్ స్టార్ నానితో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్, చైల్డ్ ఆర్టిస్ట్ కియారా ఖన్నా కూడా ‘హాయ్ నాన్న’లో యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. ఎమోషనల్ సీన్స్‌లో ముగ్గురూ పోటాపోటీగా నటించి ఆడియన్స్‌ను ఏడిపించేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో చాలా మంది ప్రేక్షకులను కంటతడి పెట్టేలా చేసింది ‘హాయ్ నాన్న’. చైల్ట్ ఆర్టిస్ట్ కియారా యాక్టింగ్‌కు ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయి.. తనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.


తెలుగుతో పాటు ఇతర భాషల్లో..
నెట్‌ఫ్లిక్స్‌లో ‘హాయ్ నాన్న’ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలయ్యింది. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ మూవీ.. ఇతర భాషా ప్రేక్షకులకు కూడా కచ్చితంగా నచ్చుతుందని నాని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఈ మూవీ స్ట్రీమింగ్‌ను కూడా ప్రారంభించేశారు. థియేటర్లలో ఎన్నిసార్లు చూసినా.. ఓటీటీలో చూసినప్పుడు కూడా అదే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందని మూవీ చూసిన ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘సీతారామం’లో సీతగా నటించి మెప్పించిన మృణాల్ ఠాకూర్. ‘హాయ్ నాన్న’లో యశ్న పాత్రలో అంతకంటే ఎక్కువగానే ఆకట్టుకుందని చాలావరకు పాజిటివ్ రివ్యూలు అందుకుంది. మృణాల్ స్క్రిప్ట్ సెలక్షన్, అందులో తన నటన ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉందని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. తన తరువాతి సినిమాలో కోసం ఎదురుచూస్తున్నారు. ఇక చైల్ట్ ఆర్టిస్ట్ కియారా ఖన్నాకు కూడా తెలుగులో మంచి అవకాశాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తనను మళ్లీ మళ్లీ స్క్రిన్‌పై చూడాలని ఆశపడుతున్నారు.


Also Read: మండపానికి జాగింగ్ చేస్తూ వచ్చిన ఆమిర్ ఖాన్ అల్లుడు - ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు