Nupur Shikhare Jogs to Wedding Venue: బాలీవుడ్‌లో గత రెండేళ్లలో చాలా మంది సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ఇక ఈ ఏడాదిలో జనవరి 3న మొదటి బాలీవుడ్ సెలబ్రిటీ పెళ్లి జరిగింది. అదే ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్‌ది. ఐరా ఖాన్, నుపూర్ శిఖరే కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అందుకే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా చేశారు ఆమిర్ ఖాన్. ఎంగేజ్‌మెంట్ అయిన సంవత్సరం తర్వాత వీరిద్దరూ పెళ్లి పీటలెక్కారు. అయితే అందరు పెళ్లి కొడుకుల్లాగా నుపూర్ గుర్రం మీద రాకుండా జాగింగ్ చేస్తూ మండపానికి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 8 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ మండపానికి చేరుకున్నాడట ఈ వరుడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరో రిసెప్షన్..
ఐరా ఖాన్, నుపూర్ శిఖరే తమ పెళ్లిని చాలా సింపుల్‌గా పూర్తి చేశారు. కోర్టు మ్యారేజ్‌తో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆ తర్వాత ముంబాయ్‌లోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో ఘనంగా సన్నిహితులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఉదయ్‌పూర్‌లో మరోసారి బాలీవుడ్ కోసం గ్రాండ్‌గా ఐరా, నుపూర్ రిసెప్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఈ వీకెండ్‌లో మరో రిసెప్షన్‌తో వీరి పెళ్లి వేడుకలు ఎండ్ అవ్వనున్నాయి. అయితే ఇంతలోనే నుపూర్ శిఖరే గురించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బుధవారం... తన పెళ్లి సమయానికి ముంబాయ్‌లోని సాంటా క్రూజ్ నుండి బాండ్రా వరకు తను జాగింగ్ చేస్తూ కనిపించాడు. పెళ్లికి ముందు ఈ జాగింగ్ ఏంటి అంటూ కొందరు నుపూర్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
జాగింగ్, డ్యాన్సింగ్..
కేవలం జాగింగ్ మాత్రమే కాదు.. మండపానికి వస్తున్న సమయంలో నుపూర్ షికారే.. తన ఫ్రెండ్స్‌తో కలిసి డోలు వాయించుకుంటూ.. డ్యాన్స్ చేస్తూ చాలా ఆనందంగా కనిపించాడు. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2020 లాక్‌డౌన్ సమయంలో నుపూర్ షికారే, ఐరా ఖాన్ ప్రేమలో పడ్డారు. ఒక ఏడాది తర్వాత.. అంటే 2021లో వీరిద్దరూ వీరి రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టారు. 2022 నవంబర్‌లో కేవలం సన్నిహితుల మధ్య, పెద్దగా హడావిడి లేకుండా ఐరా, నుపూర్‌ల ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది. ఇక ఏడాది తర్వాత 2024లో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కారు. పెళ్లి సింపుల్‌గా జరిగిపోయినా.. తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో జరిగిన వీరి రిసెప్షన్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి.
ఇటలీలో ప్రపోజల్..
2021 సెప్టెంబర్‌లో ఓ మారథాన్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఇటలీ వెళ్ళినప్పుడు ఐరాకు ప్రపోజ్ చేశాడు నుపూర్. ఆ ప్రపోజల్‌ను వెంటనే యాక్సెప్ట్ చేయడంతో పాటు పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐరా. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూతురు అయినా కూడా ఐరా ఎప్పుడూ సినీ పరిశ్రమలోకి ఎంటర్ అవ్వాలని ఆసక్తి చూపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా యాక్టివ్‌గా ఉండేది. బాలీవుడ్ జనాలకు, సోషల్ మీడియాలో ఐరాను ఫాలో అయ్యే వాళ్ళకు ఐరా, నుపూర్‌ల రిలేషన్‌షిప్ గురించి ముందే తెలుసు. తన రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా దాచిపెట్టాల్సిన అవసరం లేదు అన్నట్టుగా బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసేది ఐరా ఖాన్.
Also Read: తండ్రికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చి పిల్లను పడేశాడు - ఆమిర్ ఖాన్ అల్లుడి బ్యాగ్రౌండ్ తెలుసా?