రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిది ఆరోజే - షూటింగ్ ఎప్పుడంటే?
రాజమౌళి, మహేష్ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే, మహేష్ బాబు- రాజమౌళి ప్రాజెక్టుని ఈ ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 9న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారట. అదే రోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్డేట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇక ఈ అప్డేట్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు ఈ మూవీ టెక్నికల్ వర్క్ కోసం మహేష్ బాబు తాజాగా జర్మనీకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. కానీ మహేష్ జర్మనీకి వెళ్ళింది టెక్నికల్ వర్క్ కోసం కాదట. రాజమౌళి సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో ఉంటుంది. సినిమాలో భారీ స్టంట్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మహేష్ కి ఫిట్నెస్ చాలా అవసరం. ఈ ఫిట్నెస్ పై దృష్టి సారించడానికి మహేష్ జర్మనీలో ఓ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ని కలిసేందుకు వెళ్లారు. ఆయన వద్ద కొద్దిరోజులు ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బ్రేక్ ఈవెన్ సాధించిన ‘నా సామిరంగ’ - 8వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?
జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘నా సామిరంగ’ మూవీ రిలీజ్ అయ్యింది. ఇక ఈ వారం రోజుల్లో రూ.44.8 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌ను సాధించింది ఈ మూవీ. కలెక్షన్స్ విషయంలో దూసుకుపోవడం మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌ను కూడా సాధించింది. విడుదలయిన మొదటి రోజే ‘నా సామిరంగ’ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి ముందుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.44.8 కోట్ల కలెక్షన్స్ సాధించగా.. ఇండియాలో మాత్రమే రూ.21.89 కోట్లను కొల్లగొట్టింది. 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘నా సామిరంగ’కు రూ. 1.35 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రికార్డులు కొల్లగొడుతున్న 'హనుమాన్‌'- పది రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
బాక్సాఫీసు వద్ద 'హనుమాన్‌' హవా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ మూవీ పది రోజుల్లోనే వైడ్‌గా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని తాజాగా మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. అయోధ్య రామమందిరం ప్రతిష్టాపన సందర్భంగా హనుమాన్‌ రూ. 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని మూవీ టీం పేర్కొంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన హనుమాన్‌ ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేసుకుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ పాజిటివ్‌ రివ్యూస్‌ అందుకుంది. ఇప్పటికీ అదే జోరుతో హనుమాన్‌ రికార్డు వసూళ్ల దిశగా వెలుతుంది. ఇక మున్ముందు హనుమాన్‌ ఇంకేన్ని రికార్ట్స్‌ కొల్లగొడుతుందో చూడాలి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'జైలర్' సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ - ఈసారి అంతకుమించి, సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే?
జైలర్ సీక్వెల్ కు సంబంధించి ఆసక్తికర అప్డేట్స్ బయటకు వచ్చాయి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఆల్రెడీ జైలర్ సీక్వెల్ పై వర్క్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆయన 'జైలర్ 2' స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. రజనీకాంత్ ప్రజెంట్ దర్శకత్వంలో 'వేటయాన్' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే 'జైలర్ సీక్వెల్' సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ నుంచి సమాచారం వినిపిస్తోంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ ఈసారి సీక్వెల్ ని అంతకుమించి ప్లాన్ చేస్తున్నాడట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు- తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఇప్పటికే ఆ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసింది. సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. మూడు వారాల్లోగా రివ్యూ కమిటీ నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘వ్యూహం’ సినిమా తెరకెక్కించారని ఆరోపిస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)