Hanuman Collection: క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ యంగ్‌ హీరో తేజ సజ్జ విజువల్‌ వండర్‌ హనుమాన్‌ బాక్సాఫీసు వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ సర్‌ప్రైజింగ్‌ కలెక్షన్స్‌ చేస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ అంతఅంతా మాత్రంగానే ఉన్నాయి. కానీ మూవీకి పాజిటివ్‌ టాక్‌ రావడంతో రోజురోజుకు కలెక్షన్స్‌ పెంచుకుంటూ రికార్ట్స్‌ దిశగా పరుగులు తీస్తోంది. ఒక్క మౌత్‌ టాక్‌తోనే ఈ రేంజ్‌లో బజ్‌ క్రియేట్‌ చేసుకుంది హనుమాన్‌. చిన్న సినిమాగా బరిలోకి దిగిన ఈ సినిమా 'కేజీయఫ్', 'కాంతార' వంటి పాన్‌ ఇండియా చిత్రాల రికార్డులనే తుడిచిపెడుతుంది. ఇక ఇదే జోరు కనబరిస్తే మాత్రం రాబోయే రోసుల్లో పుష్ప, ట్రిపుల్‌ ఆర్‌ చిత్రాల రికార్డులను కూడా బ్రేక్‌ చేసేలా కనిపిస్తుంది. ఇక ఈ మూవీ విడుదలై రెండో వారంలోకి అడుగుపెట్టింది. 


అయినా బాక్సాఫీసు వద్ద అదే హవా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ మూవీ పది రోజుల్లోనే వరల్డ్‌ వైడ్‌గా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని తాజాగా మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. అయోధ్య రామమందిరం ప్రతిష్టాపన సందర్భంగా హనుమాన్‌ రూ. 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని మూవీ టీం పేర్కొంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన హనుమాన్‌ ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేసుకుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ పాజిటివ్‌ రివ్యూస్‌ అందుకుంది. ఇప్పటికీ అదే జోరుతో హనుమాన్‌ రికార్డు వసూళ్ల దిశగా వెలుతుంది. ఇక మున్ముందు హనుమాన్‌ ఇంకేన్ని రికార్ట్స్‌ కొల్లగొడుతుందో చూడాలి.






పుష్ప రికార్డు వైపు..


‘హనుమాన్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’, ‘కాంతార’కంటే ఎక్కువ అని ట్రేడ్‌ వర్గాల నుంచి  సమాచారం. మరో 10 రోజులు ఇలాగే ‘హనుమాన్’ రన్ కొనసాగితే.. ‘పుష్ప ది రైజ్’ రికార్డులను కూడా టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఫస్ట్ డే ‘హనుమాన్’కు కేవలం రూ. 8 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్‌పై పాజిటివ్ ఎఫెక్ట్ పడింది. ఫస్ట వీకెండ్‌లో రూ.16 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది ఈ మూవీ. ఇప్పటివరకు ‘హనుమాన్’ తెలుగు వర్షన్ రూ.3౩పైగా కోట్లు, హిందీ వెర్షన్ రూ.18 కోట్లు, తమిళ, కన్నడ వెర్షన్స్ కలిపి రూ.22 లక్షలు, మలయాళంలో రూ.8 లక్షల కలెక్షన్స్ సాధించినట్టు ట్రేడ్ పండితులు అంచన. 


స్టార్స్‌ ప్రశంసలు


విజువల్‌ వండర్‌తో స్టార్స్‌ను హనుమాన్‌ కట్టిపడేస్తోంది. 'హనుమాన్‌' సినిమాకు ఆడియన్స్‌కు మాత్రమే సినీ, ఇండస్ట్రీ ప్రముఖులను సైతం ఫిదా అవుతున్నారు. మూవీ చూసిన సెలబ్రెటీలు ఒక్కొక్కరు తమ అనుభవాన్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు హనుమాన్‌ మూవీ ఒక అద్భుతమంటూ తమ రివ్యూను ప్రకటించారు. వారిలో మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు ఉండటం విశేషం. అలాగే కన్నడ ఇండస్ట్రీకి చెందని సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ సైతం హనుమాన్‌ మెచ్చుకున్నారు. అంతేకాదు నేరుగా మూవీ టీంను కలిసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కాంతార మూవీ డైరెక్టర్‌ రిషబ్‌ శెట్టి కూడా హనుమాన్‌ మూవీని ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ షేర్‌ చేశాడు. రీసెంట్‌ సమంత కూడా తన రివ్యూ ప్రకటించింది.