Naa Saami Ranga Worldwide Box Office Collection Day 8: సీనియర్ హీరో నాగార్జున.. ఈసారి ‘నా సామిరంగ’తో సంక్రాంతి బరిలోకి దిగారు. ఇప్పటికే పలుమార్లు సంక్రాంతి పండగ అనేది ఈ హీరోకు కలిసొచ్చింది. ఇక ‘నా సామిరంగ’ హిట్ అవ్వడంతో ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ మూవీ విడుదలయిన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సంతోషంగా ప్రకటించింది. అంతే కాకుండా ఏయే ప్రాంతాల్లో ఎంత బ్రేక్ ఈవెన్ సాధించింది అనే వివరాలను కూడా బయటపెట్టింది. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నా సామిరంగ’ను సంతోషంగా సంక్రాంతి హిట్ అంటూ ప్రకటించేస్తున్నారు మేకర్స్.
బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్..
జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘నా సామిరంగ’ మూవీ రిలీజ్ అయ్యింది. ఇక ఈ వారం రోజుల్లో రూ.44.8 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌ను సాధించింది ఈ మూవీ. కలెక్షన్స్ విషయంలో దూసుకుపోవడం మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌ను కూడా సాధించింది. విడుదలయిన మొదటి రోజే ‘నా సామిరంగ’ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి ముందుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.44.8 కోట్ల కలెక్షన్స్ సాధించగా.. ఇండియాలో మాత్రమే రూ.21.89 కోట్లను కొల్లగొట్టింది. 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘నా సామిరంగ’కు రూ. 1.35 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో ‘నా సామిరంగ’ 8వ రోజు కలెక్షన్స్..
నైజాం - రూ.26 లక్షలు
సీడెడ్ - రూ.23 లక్షలు
వైజాగ్ - రూ.28 లక్షలు
ఈస్ట్ - రూ.19 లక్షలు
వెస్ట్ - రూ.10 లక్షలు
కృష్ణ - రూ.11 లక్షలు
గుంటూరు - రూ. 12 లక్షలు
నెల్లూరు - రూ. 6 లక్షలు
నటీనటుల యాక్టింగ్‌కు ఫిదా..
కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’లో ఆయనకు జోడీగా అషికా రంగనాథ్ అలరించింది. చిన్న వయసులోనే అంత మంచి పాత్ర పోషించినందుకు, ఆ పాత్రలో ఒదిగిపోయినందుకు అషికాకు మంచి మార్కులు పడుతున్నాయి. ఇక ఇందులో సెకండ్ హీరోలుగా రాజ్ తరుణ్, అల్లరి నరేశ్ అలరించారు. నాగార్జునతో పాటు వీరిద్దరి పాత్రలు కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాయి. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నా సామిరంగ’కు శ్రీనివాస చిత్తూరి నిర్మాతగా వ్యవహరించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ‘ది ఘోస్ట్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాగార్జున.. ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారని అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మోస్ట్ వాంటెడ్ హిట్..
గత కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ కలిసి వచ్చింది. ‘నా సామిరంగ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మామూలుగా ఏ సంక్రాంతికి అయినా నాగార్జున సినిమా విడుదల అయ్యిందంటే పక్కా సక్సెస్ అవుతుందనే టాక్ ఉంది. ఆ సెంటిమెంట్ ఈ సినిమాతో మరోసారి నిజమేనని నిరూపణ అయ్యింది. ఇక ‘నా సామిరంగ’ మూవీకి ఆస్కార్ విన్నర్స్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు.
Also Read: సీక్రెట్‌గా ‘బిగ్ బాస్’ శోభా ఎంగేజ్‌మెంట్? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్