Shobha Shetty Engagement: బిగ్ బాస్ సీజన్ 7లో అందరికంటే ఎక్కువగా నెగిటివిటీతో బయటికి వచ్చేసిన కంటెస్టెంట్ శోభా శెట్టి. ఇక ఈ భామ.. హౌజ్‌లో ఉన్నప్పుడే తన ప్రేమకథ గురించి బయటపెట్టింది. తన సహ నటుడు యశ్వంత్‌తో ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. అంతే కాకుండా శోభాను కలవడం కోసం యశ్వంత్‌ను షో కూడా తీసుకొచ్చింది బిగ్ బాస్ టీమ్. అప్పటినుండి శోభా పర్సనల్ లైఫ్‌పై ప్రేక్షకుల ఫోకస్ పెరిగింది. ఇక బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత యశ్వంత్‌తో కలిసి పలు వీడియోలు కూడా చేసింది శోభా. ఇక తాజాగా వీరిద్దరికీ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ అయినట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


శోభా శెట్టి ప్రేమకథ..


శోభా శెట్టి, యశ్వంత్ ఒకప్పుడు కలిసి సీరియల్‌లో నటించారు. ఆ సీరియల్ సమయంలోనే ముందుగా తాను యశ్వంత్‌తో ప్రేమలో పడినట్టు శోభా బయటపెట్టింది. తనే ముందుగా ప్రేమ, పెళ్లి గురంచి ప్రపోజ్ చేశానని.. కొన్నాళ్లు ఆలోచించుకున్న తర్వాత యశ్వంత్ దీనికి ఎస్ అని సమాధానం చెప్పాడని బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీని వివరించింది. ఇక శోభా.. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు యశ్వంత్ కూడా బయట నుండి చాలా సపోర్ట్‌ను అందించాడు. తనపై వచ్చిన నెగిటివిటీని కూడా ఖండించాడు. శోభాకు ఓట్లు వేయమని ఆడియన్స్‌ను రిక్వెస్ట్ చేశాడు. ఫైనల్‌గా ఈ జంట పెళ్లితో ఒక్కటి అవ్వనున్నారని తెలుస్తోంది.


స్టేజ్‌పైనే ఎంగేజ్‌మెంట్..


బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత శోభా శెట్టి.. ఒక స్పెషల్ ఈవెంట్‌లో పాల్గొంది. ఆ ఈవెంట్‌కు యశ్వంత్‌ను తీసుకొచ్చి శోభాను సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. అంతే కాకుండా ఆ స్టేజ్‌పైనే రింగ్స్‌ను కూడా మార్చుకోమన్నారు. అలా స్టేజ్‌పైన వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది. ఇక తాజాగా మరోసారి వీరిద్దరికి ఇంట్లోనే సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగినట్టుగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను స్టార్ మా సీరియల్స్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసింది. ముందుగా ఈ ఫోటోలు చూసిన వారు ఇది సీరియల్ షూటింగ్ అయ్యిండవచ్చని అనుమానాలు వ్యక్తం చేసినా.. ఈ ఫోటోల్లో శోభా శెట్టి, యశ్వంత్‌ల తల్లిదండ్రులు కూడా కనిపిస్తుండడంతో నిజంగానే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయ్యిందని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు.






మరోవైపు ప్రియాంక, శివ్..


ఇక తమ ఎంగేజ్‌మెంట్ గురించి శోభా శెట్టి గానీ, యశ్వంత్ గానీ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయలేదు. అంటే దీని గురించి వీరు నిధానంగా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారేమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు. బిగ్ బాస్ నుండి బయటికి రాగానే త్వరలోనే పెళ్లి కబురు వినిపిస్తానని శోభా శెట్టి మాటిచ్చింది. చెప్పినట్టుగానే అప్పుడే ఎంగేజ్‌మెంట్‌ను చేసుకుంది. ఇక వీరి ఎంగేజ్‌మెంట్ గురించి, తర్వాత జరగబోయే పెళ్లి గురించి ఎప్పుడు అనౌన్స్ చేస్తుందా అని బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరోవైపు శోభా శెట్టి ఫ్రెండ్ ప్రియాంక కూడా తన బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది వారిద్దరితో పెళ్లితో ఒక్కటవుతాం అని ప్రకటించింది.


Also Read: ఎన్టీఆర్ సినిమాలో 'గుప్పెడంత మనసు' ఫేమ్ జ్యోతి రాయ్?