‘దేవర’ వాయిదా అంటూ రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన టీమ్!
టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘దేవర’ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అనుకున్న తేదీకి వస్తుందా రాదా అనే విషయమై కన్ఫ్యూజన్ నెలకొంది. ‘దేవర’ అనుకున్న తేదీకి రాకపోతే మార్చి 30వ తేదీకి ‘టిల్లు స్క్వేర్’ వస్తుందని కొన్ని వార్తలు వినిపించాయి. దీనిపై ‘దేవర’ టీమ్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి సమాధానం ఇచ్చింది. ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల అవుతుందని మరోసారి నొక్కి చెప్పింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మాట నిలబెట్టుకున్న ‘హనుమాన్’ టీమ్, అయోధ్య రామయ్యకు భారీ విరాళం
తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ రోజు రోజుకు మరింత ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో వసూళ్లు అందుకుంటోంది. ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, రూ. 200 కోట్ల మార్క్ ను చేరుకునే దిశగా పయనిస్తోంది. ఈ మూవీ రెండో వారంలోనూ మంచి ఆక్యుపెన్సీని సాధిస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్య భవ్య రామ మందిరానికి పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటి వరకు అమ్ముడైన ప్రతి టికెన్ నుంచి రూ. 5 రామయ్యకు అందజేయనున్నట్లు తెలిపింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
హృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ ఫేక్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?
హృతిక్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ సినిమా 'ఫైటర్'. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్. ఇద్దరూ ఫైటర్ జెట్ పైలట్ రోల్స్ చేశారు. వీళ్లతో పాటు సీనియర్ హీరో అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ గురువారం (జనవరి 25న) థియేటర్లలో విడుదల అవుతోంది. అయితే, ఈ సినిమాకు ఆల్రెడీ ఫేక్ రివ్యూస్ స్టార్ట్ అయ్యాయి. ప్రతి సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో ఫేక్ రివ్యూస్ పోస్ట్ చూస్తూ పాపులర్ అయిన వ్యక్తి ఉమైర్ సందు. ఇప్పుడు 'ఫైటర్' మీద పడ్డాడు. సినిమా బాలేదని శనివారం ట్వీట్ చేశాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
టు మినిట్స్ కూడా లేవుగా - వైరల్ అవుతున్న ప్రభాస్ 'సలార్' డైలాగ్స్
సలార్' సినిమా ఇటీవల ఓటీటీ వేదికలోకి వచ్చింది. అయితే, ఆ తర్వాత ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం రెండున్నర నిమిషాలు కూడా లేని ఆ వీడియోలో ఏం ఉందో తెలుసా? సినిమా అంతా ప్రభాస్ చెప్పిన డైలాగ్స్! నిజమే... జస్ట్ టు అండ్ హాఫ్ మినిట్స్ మాత్రమే ఉన్నాయి డైలాగ్స్. కమర్షియల్ సినిమాలో హీరోలు పంచ్ డైలాగ్స్ చెప్పడం కామన్! మన ప్రేక్షకులు, అభిమానులు సైతం తమ హీరోలు పంచ్ డైలాగ్స్ చెప్పాలని కోరుకుంటారు. కానీ, 'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ప్రభాస్ లాంటి స్టార్ హీరోని పెట్టుకుని కొత్త ప్రయోగం చేశారు. హీరోతో చాలా తక్కువ డైలాగ్స్ చెప్పించారు. హీరోయిజం ఎలివేట్ చేసే ఫైట్స్, యాక్షన్ షాట్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రవితేజ సినిమాలో కన్నడ హీరోయిన్‌కు ఛాన్స్ - ఆమె ఎవరంటే?
పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉన్న స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, అలీ నుంచి మొదలు పెడితే... ఈ జనరేషన్ కమెడియన్ 'వెన్నెల' కిశోర్ సహా ప్రతి ఒక్కరితో ఆయన చేసిన కామెడీ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఫుల్లుగా నవ్వించాయి. ఒకప్పుడు ఎంటర్టైనర్ సినిమాలు చేసిన రవితేజ... సీరియస్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)