Telugu News Today: రసకందాయంలో ఖమ్మం కాంగ్రెస్ పోలిటిక్స్! ముగ్గురు మంత్రుల మధ్య కోల్డ్ వార్!
ఎన్నికల ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam News) రాజకీయాలు హట్ హట్ గా సాగిన పరిస్థితి తెలుసు. ఆ ఎన్నికల్లో  కాంగ్రెస్ 8 స్థానాలు, సీపీఐ ఒక స్థాం, బీఆర్ఎస్  ఒక స్థానం లో గెలిచాయి. ఎన్నికల తర్వాత కూడా  ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. ఏ జిల్లాకు లేనట్లుగా  ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి.  ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, వ్యవయసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రిగా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదవులు పొందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


షర్మిల కాన్వాయ్ అడ్డగింత! మమ్మల్ని చూసి భయపడుతున్నారా సార్? అంటూ వ్యాఖ్యలు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నేడు బాధ్యతలు చేపట్టనున్న వేళ ఆమె కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో ఆమె గన్నవరం విమానాశ్రయానికి రాగా.. అక్కడి నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో షర్మిల ఏపీ కాంగ్రెస్ కార్యాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఎనికే పాడు వద్ద వాహనాలను పోలీసులు మళ్లించారు. వాహనాలను మళ్లించినందుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు రోడ్డుమీద బైఠాయించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని చూసి ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. అందుకే తన కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


నాలుగు లక్షల ఓట్లతో అధికారానికి దూరం, ఈ సారి అది జరగకూడదు: కేటీఆర్ 
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం నాలుగు లక్షల ఓట్లతో అధికారానికి దూరం అయ్యామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.  ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందని అన్నారు. బీఆర్ఎస్ మరో ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఉండేదని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఉత్తరాంధ్రలో తొలి అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు, అరకులో ఆయనకే ఛాన్స్
రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. మరో పక్క వైసీపీ అధినేత జగన్‌, జనసేనాని కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపికపైనా దృష్టి సారించాయి. ఇప్పటికే పలు విడతల్లో అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించగా, తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఆ దిశగా సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


ఎన్నికలు ఎప్పుడో చెప్పిన కిషన్ రెడ్డి, మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు 
ప్రధాని నరేంద్రమోదీ మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ (Kishan Reddy) రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) జరుగుతాయని చెప్పారు. 350కి పైగా స్థానాల్లో బీజేపీ జెండా ఎగరబోతోందన్నారు. మోదీ మూడో సారి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఏ పేపర్ చూసినా కుంభకోణాలు ఉండేవని విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి