Prabhas viral video Salaar dialogues: 'సలార్' సినిమా ఇటీవల ఓటీటీ వేదికలోకి వచ్చింది. అయితే, ఆ తర్వాత ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం రెండున్నర నిమిషాలు కూడా లేని ఆ వీడియోలో ఏం ఉందో తెలుసా? సినిమా అంతా ప్రభాస్ చెప్పిన డైలాగ్స్! నిజమే... జస్ట్ టు అండ్ హాఫ్ మినిట్స్ మాత్రమే ఉన్నాయి డైలాగ్స్.   


ప్రభాస్ డైలాగ్స్ రెండున్నర నిమిషాలే
కమర్షియల్ సినిమాలో హీరోలు పంచ్ డైలాగ్స్ చెప్పడం కామన్! మన ప్రేక్షకులు, అభిమానులు సైతం తమ హీరోలు పంచ్ డైలాగ్స్ చెప్పాలని కోరుకుంటారు. కానీ,  'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ప్రభాస్ లాంటి స్టార్ హీరోని పెట్టుకుని కొత్త ప్రయోగం చేశారు. హీరోతో చాలా తక్కువ డైలాగ్స్ చెప్పించారు. హీరోయిజం ఎలివేట్ చేసే ఫైట్స్, యాక్షన్ షాట్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు.


'సలార్' ఓటీటీలో విడుదలైన తర్వాత సినిమా మొత్తం మీద ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ ఎడిట్ చేశారు ఓ నెటిజన్. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కసారి ఆ వీడియో మీద మీరూ లుక్ వేయండి


ALso Read: హృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ ఫేక్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?






నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 'సలార్' స్ట్రీమింగ్
డిసెంబర్ 22న 'సలార్' థియేటర్లలో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 700 కోట్లు కలెక్ట్ చేసింది. థియేటర్లలో విడుదలైన 28 రోజులకు డిజిటల్ రిలీజ్ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ మంచి ఆదరణ లభిస్తోంది.


ALso Readసితార గొప్ప మనసు - అనాథల కోసం 'గుంటూరు కారం' స్పెషల్ షో


యాక్షన్ సీక్వెన్సులకు సూపర్బ్ రెస్పాన్స్
'సలార్' సినిమాలో యాక్షన్ సీక్వెన్సులకు అద్భుతమైన స్పందన లభించింది. మరీ ముఖ్యంగా కోటెరమ్మ ఫైట్ అయితే థియేటర్లలో పూనకాలు తెప్పించింది. కోల్ మైన్స్ దగ్గర ఫైట్ గానీ, కోటెరమ్మ తర్వాత ఖాన్సార్ పెద్దల సమక్షంలో జరిగే ఫైట్ గానీ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది. ముఖ్యంగా 'సలార్' ఎండింగ్ ట్విస్ట్ రెండో పార్ట్ మీద విపరీతమైన అంచనాలు పెంచింది. ఈ ఏడాది ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లవచ్చని టాక్.


ALso Read: నంబర్ వన్ బుల్ షిట్ గై... 'బాబు'తో బజ్జీ పాప



ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్'ను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేశారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేసింది. శృతి హాసన్ కథానాయికగా నటించిన 'సలార్'లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో స్నేహితుడిగా ప్రధాన పాత్ర చేశారు. ఇంకా ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.