Upcoming movies of Kushitha Kallapu: కుషిత కల్లాపు గుర్తు ఉన్నారా? సోషల్ మీడియాలో ఈ అమ్మాయి పాపులర్. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అని కూడా చెప్పవచ్చు. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ కొన్ని చేశారు. కథానాయికగా సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. ఫిలిమ్స్, సోషల్ మీడియాలో కంటే ఆ మధ్య కుషిత పేరు వార్తల్లో బాగా పాపులర్ అయ్యింది. బజ్జీ పాపగా ఫేమస్ అయ్యారు. ఆవిడ వీడియో వైరల్ అయ్యింది. అదంతా గతం! ఇప్పుడు సినిమాలు, హీరోయిన్ క్యారెక్టర్ల మీద ఫోకస్ చేసిన కుషితా కల్లాపు... త్వరలో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఆ సినిమా పేరు 'బాబు'. పూర్తి వివరాల్లోకి వెళితే... 


మూడు భాషల్లో అర్జున్ కళ్యాణ్ 'బాబు'   
తొలుత యూట్యూబ్ ఫిలిమ్స్, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద రోల్స్ చేయడం ద్వారా పాపులర్ అయిన నటుడు అర్జున్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నారు. అర్జున్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా సినిమా 'బాబు'. నంబర్ వన్ బుల్ షిట్ గై... అనేది ఉపశీర్షిక. ఇందులో కుషితా కల్లాపు హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర బృందం తెలియజేసింది.


Also Read: ‘దేవర’ వాయిదా అంటూ రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన టీమ్!



విలాసం కన్నా అవసరం గొప్పది
'బాబు' చిత్రాన్ని డీడీ క్రియేషన్స్ పతాకంపై దండు దిలీప్ కుమార్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ) దర్శకత్వం వహించారు. విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించామని దర్శక నిర్మాతలు తెలిపారు.


Also Read: టాలీవుడ్‌ నంది అవార్డులపై కదలిక, డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు



ఇంకా చిత్ర నిర్మాత దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ''ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా మా దర్శకుడు లక్ష్మణ్ వర్మ ఈ సినిమాను రూపొందించారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.


Also Read: రామ మందిరం ప్రారంభోత్సవం.. వెండితెరపై అలరించిన శ్రీరాముని పాటలు ఇవే!



గత ఏడాది కుషితా కల్లాపు నటించిన 'నీతోనే నేను' సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. అర్జున్ కళ్యాణ్ 'అడ్డతీగల', అంతకు ముందు 'పెళ్లికూతురు పార్టీ' సినిమాలు చేశారు. అవి ఆశించిన విజయాలు సాధించలేదు. అందువల్ల, హీరో హీరోయిన్లు ఇద్దరికీ ఈ సినిమా విజయం చాలా కీలకం. 'బాబు'తో తప్పకుండా హిట్ వస్తుందని ఇద్దరూ ధీమాగా ఉన్నారు. 


అర్జున్ కళ్యాణ్, కుషిత కల్లాపు జంటగా నటించిన 'బాబు' సినిమాలో ఎంఎల్ఆర్, సోనాలి, 'బలగం', 'డీజే టిల్లు' ఫేమ్ మురళీధర్ గౌడ్, భద్రం, 'జబర్దస్త్' అప్పారావు, రవి వర్మ, సునీత మనోహర్, అశోక్ వర్ధన్, భద్రి జార్జి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: డీడీ క్రియేషన్స్, ఛాయాగ్రహణం: పీఎస్ మణికరన్, కూర్పు: డి. వెంకట ప్రభు, సంగీత దర్శకుడు: పవన్, నిర్మాత: దండు దిలీప్ కుమార్ రెడ్డి, దర్శకత్వం: ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ).