‘హనుమాన్‘ మూవీ చూసిన ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి - ఆయన స్పందన ఇదే
చిన్న సినిమాగా సంక్రాంతి బరిలో నిలిచిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలను వెనక్కి నెట్టి మరీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రోజు రోజుకూ వసూళ్ల వర్షం కురిపిస్తూ ముందుకెళ్తోంది. భారత్ తో పాటు ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. అమెరికాలోనూ 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తొలి వారంలో ‘RRR’, ‘బాహుబలి’, ‘సలార్’ రికార్డులను ‘హనుమాన్’ బద్దలు కొట్టింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
అరెరే వేరే కథతో ప్రభాస్ 'రాజ్ సాబ్' సినిమా తీస్తున్నా - ఫన్నీగా స్పందించిన మారుతి
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'రాజా సాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పటి వరకు లుక్ విడుదల చేయడం తప్ప మరొక విషయం ఏదీ యూనిట్ చెప్పలేదు. అయితే... సినిమా కథ ఇదేనంటూ ఐఎండీబీ వెబ్ సైట్ ఓ స్టోరీ లైన్ పబ్లిష్ చేసింది. దానిపై దర్శకుడు మారుతి ఫన్నీగా స్పందించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ధనుష్‌ను నార్త్ జనాలు వింతగా చూసేవారు - ప్రముఖ దర్శకుడు షాకింగ్ కామెంట్స్!
ఈ సంక్రాంతికి 'కెప్టెన్ మిల్లర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ పాన్ ఇండియా ట్రెండ్ ఇండియాలోకి రాకముందే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. 2013లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన 'రాంజనా' సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చాడు ధనుష్. అయితే అప్పటికి తమిళంలో స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ హిందీ ప్రేక్షకులకు ధనుష్ గురించి పెద్దగా పరిచయం లేదు. దాంతో బాలీవుడ్ లో ధనుష్ ఆ టైంలో ఆడియన్స్ కి చేరువకాలేకపోయాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
దేశవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌కు చేరువలో ‘గుంటూరు కారం’ - ఈ ఒక్కరోజే అంత టార్గెట్?
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలయ్యి ఫస్ట్ షో పూర్తయినప్పటి నుండే మూవీకి మిక్స్‌డ్ టాక్ లభించింది. అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ‘గుంటూరు కారం’ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. నెగిటివ్ టాక్ వచ్చినా కూడా రివ్యూలను పట్టించుకోకుండా సినిమాను చూడడానికి వెళ్తున్నారు కొందరు ప్రేక్షకులు. అందుకే ‘గుంటూరు కారం’ విడుదలయ్యి అయిదు రోజులు పూర్తయ్యేసరికి కేవలం ఇండియాలోనే రూ.100 కోట్ల మార్క్ టచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కలెక్షన్స్ లెక్కలు మహేశ్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మహేష్ రికవరీ రేట్ @ 70% - ఐదు రోజుల్లో 'గుంటూరు కారం' వంద కోట్లకు దగ్గరకు వచ్చినా సరే...
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన 'గుంటూరు కారం' సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి బరిలో విడుదలైంది. అయితే... జనవరి 12న తెల్లవారుజామున ఒంటి గంటకు వేసిన ప్రీమియర్ / బెనిఫిట్ షోస్ తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. మహేష్ వీరాభిమానుల్లో కొందరు సైతం ఆశించిన రీతిలో సినిమా లేదని విమర్శలు చేశారు. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి ఇటువంటి సినిమా వస్తుందని ఊహించలేదని పేర్కొన్నారు. అయితే... సంక్రాంతి సీజన్, ఫెస్టివల్ హాలిడేస్, మహేష్ & త్రివిక్రమ్ ఇమేజ్ కలిసి ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)