Ram Mandir Opening: అయోధ్య ఉత్సవంపై కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న (KN Rajanna) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బెంగళూరులోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ కామెంట్స్ చేశారు. బాబ్రీ మసీదుపై దాడి చేసిన ఘటనను గుర్తు చేసుకుంటూ బీజేపీపై విమర్శలు చేశారు. ఆ సమయంలో బీజేపీ నేతలు మసీదుపై దాడి చేసి ఆ తరవాత టెంట్‌లో రెండు బొమ్మలు పెట్టి వాటినే రాముడు అంటూ నమ్మించారని మండి పడ్డారు. తానూ ఓ సారి అయోధ్య వెళ్లానని అప్పుడున్న ఆ భక్తిభావం ఇప్పుడు కలగడం లేదని అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న రామాలయాలు ఎన్నో ఉన్నాయని, కేవలం ఎన్నికల కోసమే బీజేపీ అయోధ్య పేరుతో హడావుడి చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. అయితే...ఆయన రాముడిపై చేసిన వ్యాఖ్యల్ని పలువురు నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. 


"వేల సంవత్సరాల చరిత్ర ఉన్న రాముడి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం అయోధ్య రామ మందిరాన్ని కేవలం ఎన్నికల కోసమే నిర్మించింది. ప్రజల్ని మోసం చేస్తోంది. బాబ్రీ మసీదుని కూల్చిన సమయంలో నేనూ అయోధ్య వెళ్లాను. ఆ తరవాత బీజేపీ వాళ్లు ఓ టెంట్‌లో రెండు బొమ్మలు తెచ్చి పెట్టారు. వాటినే శ్రీరాముడు అని ప్రచారం చేశారు. అప్పుడు అయోధ్యను సందర్శించిన తరవాత ఇంటికి వెళ్లినా ఏదో తెలియని తన్మయత్వం నన్ను వెంటాడింది. ఇప్పుడు అయోధ్య వెళ్తే మాత్రం అసలు ఆ భావనే కలగడం లేదు"


- కేఎన్ రాజన్న, కర్ణాటక మంత్రి






విశ్వహిందూ పరిషత్ అసహనం..


ఈ వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్ డిప్యుటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్‌ స్పందించారు. కోట్లాది మంది ప్రజల హృదయాల్లో కొలువై ఉన్న రాముడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మండి పడ్డారు. అటు విశ్వహిందూ పరిషత్ కూడా తీవ్రంగానే స్పందించింది. ఏమీ చేయలేక అసహనంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడింది. 






Also Read: Ram Mandir Inauguration: జనవరి 22న ఆ రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే, అయోధ్య ఉత్సవం సందర్భంగా నిర్ణయం