ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins)ను ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది. 2023 డిసెంబరు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ICC Player Of The Month Awards For December) అవార్డును ఐసీసీ కమిన్స్‌కు ప్రకటించింది. బంగ్లాదేశ్‌కు చెందిన తైజుల్ ఇస్లాం, న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్‌ను వెనక్కినెట్టి కెరీర్‌లో తొలిసారి కమిన్స్ అవార్డును అందుకున్నాడు. కమిన్స్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్( అవార్డు రేసులోనూ ఉన్నాడు.
క్రికెట్‌లో 2023 కమిన్స్‌దే
ఆస్ట్రేలియా(Austrelia) క్రికెట్(Cricket) జట్టుకు 2023 స్వర్ణ యుగమనే చెప్పాలి. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా కంగారులు వన్డే ప్రపంచకప్(World cup) ను కూడా కైవసం చేసుకున్నారు. ఫైనల్లో అద్భుత ఆటతీరుతో భారత్(Bharat)ను కంగుతినిపించి ఆరోసారి ప్రపంచ కప్‌ను సాధించారు. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టు 2023లో అద్భుతమే చేసింది. ఒక్క ఏడాదిలో ఏకంగా మూడు కప్పులను కైవసం చేసుకుని గోల్డెన్ ఇయర్‌గా మార్చుకుంది. యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్‌లను కైవసం చేసుకుని ఈ ఏడాదిని ఆస్ట్రేలియా చిరస్మరణీయం చేసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ప్యాట్ కమిన్స్ సేన చిత్తు చేసింది. అది కూడా ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై జరిగిన యాషెస్ సిరీస్‌ను డ్రా చేసుకుంది. గతంలో యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా దగ్గరే ఉండటంతో ఇప్పుడు కూడా వాళ్ల దగ్గరే యాషెస్ ట్రోఫీ భద్రంగా ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాపై 209 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత జట్టు వరుసగా రెండోసారి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరినా ఓటమి పాలైంది. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను సొంతగడ్డపైనే ఫైనల్లో ఓడించి సగర్వంగా కప్పును ముద్దాడింది. ఇలా ఒకే ఏడాది మూడు ప్రతిష్టాత్మక టోర్నీల్లో రాణించి ఆస్ట్రేలియా 2023ను గోల్డెన్ ఇయర్‌గా మార్చుకుంది.
ఐపీఎల్‌లోనూ కమిన్స్ హవా
ఐపీఎల్ 2024 మినీ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడుగా పాట్ కమిన్స్ (Pat Cummins) నిలిచాడు. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో దిగిన పాట్ కమ్మిన్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తాన్ని పెట్టి కమిన్స్ను కొనుగోలు చేసింది. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఇతని కోసం పోటీ పడ్డాయి. మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది. ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు. కమిన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ తొలి బిడ్ వేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ రూ.4.80 కోట్ల వరకు పాడింది. ఆ తర్వాత ఆర్సీబీ బరిలోకి దిగింది. 7.60 కోట్ల వరకు చెన్నై వేలంలో ఉంది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగింది. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తన నాయకత్వంలో ఆస్ట్రేలియాకు ఆరో ప్రపంచకప్‌ను అందించాడు. ఫైనల్ లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియాను ఓడించి మరీ తన జట్టును విశ్వ విజేతగా నిలిపాడు. అందుకే ఇప్పుడు ఫ్రాంచైజీల దృష్టి కూడా కమిన్స్‌పై పడింది. 2018 ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్‌కరన్‌ను పంజాబ్ కింగ్ రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్న రికార్డును కమిన్స్ బద్దలు కొట్టాడు.