Guntur Kaaram Box Office Collections: మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలయ్యి ఫస్ట్ షో పూర్తయినప్పటి నుండే మూవీకి మిక్స్‌డ్ టాక్ లభించింది. అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ‘గుంటూరు కారం’ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. నెగిటివ్ టాక్ వచ్చినా కూడా రివ్యూలను పట్టించుకోకుండా సినిమాను చూడడానికి వెళ్తున్నారు కొందరు ప్రేక్షకులు. అందుకే ‘గుంటూరు కారం’ విడుదలయ్యి అయిదు రోజులు పూర్తయ్యేసరికి కేవలం ఇండియాలోనే రూ.100 కోట్ల మార్క్ టచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కలెక్షన్స్ లెక్కలు మహేశ్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.


దేశవ్యాప్తంగా ఎంత? ప్రపంచవ్యాప్తంగా ఎంత?
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్‌లో విడుదలయ్యింది ‘గుంటూరు కారం’. విడుదలయ్యి అయిదు రోజులు అయ్యింది. ఫస్ట్ వీకెండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ లెక్కల విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్క్‌ను టచ్ చేయడానికి చాలా దగ్గర్లో ఉంది ‘గుంటూరు కారం’. బుధవారం రన్ పూర్తయ్యే సమయానికి దేశవ్యాప్తంగా ఈ మూవీ రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. కనుమ రోజు సెలవు అయినా కూడా కలెక్షన్స్ విషయంలో కాస్త వెనకబడింది ‘గుంటూరు కారం’. అయినా కూడా డబుల్ డిజిట్స్‌లోనే కలెక్షన్స్ వచ్చాయి. దీంతో కలెక్షన్స్ విషయంలో ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.


ఈరోజుతో పూర్తి..
విడుదలయిన అయిదు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 94 కోట్లను కలెక్ట్ చేసింది ‘గుంటూరు కారం’. జనవరి 17 షోలు పూర్తయ్యే లోపు రూ.6 కోట్ల కలెక్షన్స్ సాధించడం కష్టమైన విషయం ఏమీ కాదని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. దీంతో మిక్స్‌డ్ టాక్‌తోనే దేశవ్యాప్తంగా ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘గుంటూరు కారం’ రికార్డ్ సాధించనుంది. జనవరి 16న దేశవ్యాప్తంగా ‘గుంటూరు కారం’కు ఇంకా 37.24 ఆక్యుపెన్సీ నమోదు అయినట్టు తెలుస్తోంది. దాదాపు సంవత్సరానికి పైగా మహేశ్ బాబును స్క్రీన్‌పై చూడలేదు ఫ్యాన్స్. అందుకే ‘గుంటూరు కారం’లో మహేశ్ కామెడీ, డ్యాన్స్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్.. ఇలా అన్ని అంశాలను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.


అదే రిపీట్..
మహేశ్ బాబు చివరిగా కనిపించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఆ మూవీకి కూడా ఇలాగే మిక్స్‌డ్ టాక్ లభించినా.. కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇప్పుడు ‘గుంటూరు కారం’ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ మూవీలో మహేశ్ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది. స్క్రీన్‌పై శ్రీలీల డ్యాన్స్‌కు ప్రేక్షకులు మరోసారి ఫిదా అవుతున్నారు. ఇక శ్రీలీలకు సమానంగా మహేశ్ డ్యాన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. వీరితో పాటు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు.. ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. గ్లామర్, టాలెంట్ ఉన్నా కూడా మీనాక్షి చౌదరిలాంటి హీరోయిన్‌కు అంత చిన్న రోల్ ఇవ్వడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: రోజూ రెండు రౌండ్లు మద్యం, స్వీట్స్ తినకపోతే నిద్ర రాదు - నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవేనట