Akkineni Nagarjuna About His Food Diet: అక్కినేని నాగార్జున సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయ్యింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నా సామిరంగ‘ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించగా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. లవ్, ఎమోషన్, కామెడీ, యాక్షన్ కలగలిపిన ‘నా సామిరంగ‘తో నాగార్జున ప్రేక్షకులను బాగా అలరించారు. వసూళ్ల పరంగానూ ఈ సినిమా సత్తా చాటుతోంది. మూడు రోజుల్లోనే సుమారు రూ. 25 కోట్లు సాధించి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.  


తన ఫిట్ నెస్ సీక్సెట్స్ చెప్పిన నాగార్జున


‘నా సామిరంగ‘ ప్రమోషన్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ కలిసి నాగార్జునను స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఆయన సినిమాలతో పాటు వ్యక్తిగత అంశాలకు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగారు. ‘‘మీరు నాకన్న వయస్సులో పెద్ద కదా. కానీ నేను మీ కంటే పెద్దగా కనిపిస్తున్నా కదా. నాకు మన్మథుడిలా కనిపించాలని కాదు.. హెల్త్, ఫిట్‌నెస్ చాలా అవసరం. మీలా ఉండాలంటే ఏం చేయాలి? సైకిల్ తొక్కాలా? ఏం చేయమంటారు?’’ అని కీరవాణి అడిగారు. వయస్సులో కీరవాణి కంటే తాను పెద్దవాడినే అని నాగార్జున తెలిపారు.


ఈ సందర్భంగా తన డైట్ సీక్రెట్స్ పంచుకున్నారు నాగార్జున. “కష్టపడినంత మాత్రాన ఫిట్ గా ఉంటామనేది నిజం కాదు. సైకిల్ తొక్కడం వల్ల ఫిట్ నెస్ రాదు. నేను చక్కగా డిన్నర్  చేస్తాను. బ్రౌన్ రైస్ తింటాను, చికెన్ తింటాను, ఫిష్ తింటాను. నెయ్యి తింటాను. భోజనం చేసే ప్రతిసారి మూడు ఆకుకూరలు తింటాను. పచ్చళ్లు తింటాను. రోజు రెండు రౌండ్లు మద్యం తాగుతాను. స్వీట్స్ తినకుండా నిద్రపట్టదు. ఫిట్ నెస్ కోసం కడుపు మాత్రం మాడ్చుకోను. అన్నీ రకాల ఫుడ్స్ తీసుకున్నా, కచ్చితంగా వర్కౌట్స్ చేస్తాను. తిన్న కేలరీస్ బర్న్ అయ్యేలా ఎక్సర్ సైజ్ చేస్తాను. హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. వే ఆఫ్ లివింగ్ తోనే ఫిట్ నెస్ అనేది వస్తుందని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.


ఇక తిండి విషయంలో తాను చాలా ఇన్ డిస్సిప్లేన్ గా ఉంటానని కీరవాణి చెప్పారు. ఏది నచ్చితే అది తింటానని చెప్పారు. నూడుల్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా, నాకు చాలా ఇష్టం అన్నారు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఆషికా రంగనాథ్  హీరోయిన్ గా నటించారు. నాజర్, మిర్నా మీనన్, రావు రమేష్ సహా పలువురు ఇతర పాత్రల్లో కనిపించారు.   కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ‘నా సామిరంగ’తో దర్శకుడిగా మారారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు.    


Read Also: ఒకే డ్రెస్‌ రెండేళ్లు వేసుకున్న మెగాస్టార్, ‘అంజి’ మూవీ కోసం చిరంజీవిని కోడి రామకృష్ణ అంత కష్టపెట్టారా?