ఓటీటీలోకి వచ్చేసిన 'కోటబొమ్మాళి పిఎస్' - ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఎక్కడ చూడొచ్చంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ పాత్రల్లో నటించిన 'కోట బొమ్మాళి పీఎస్' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్, విద్యా కొప్పినీడి ఈ సినిమాని నిర్మించారు. నవంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టింది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సస్పెన్స్ ఎలివెంట్స్ తో పాటు ఎమోషన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ కానిస్టేబుల్స్ పాత్రల్లో మంచి నటనను కనబరిచారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
త్రివిక్రమ్, శ్రీలీల నవ్వులు, మహేష్ మాస్ ఎనర్జీ అదుర్స్ - 'మేకింగ్ ఆఫ్ గుంటూరు కారం' వీడియో చూశారా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంక్రాంతికి 4 సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతుంటే అందరి కళ్ళు గుంటూరు కారం పైనే ఉన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకోవడంతోపాటు సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ 'మెర్రీ క్రిస్మస్' ఫస్ట్ రివ్యూ
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. తమిళ్ హీరో అయిన ఆయనకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కథ డిమాండ్ మేరకు ప్రస్తుతం వరుసగా విలన్ రోల్స్ చేస్తూ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. భాష ఏదైనా స్టార్ హీరో సినిమాలో విలన్ పాత్ర అంటే మేకర్స్ అంతా విజయ్ సేతుపతి వైపే చూస్తున్నారు. ఇప్పుడు 'మెర్రీ క్రిస్మస్'తో హీరోగా బాలీవుడ్ ప్రక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. 'బద్లాపూర్', 'అంధాధున్' ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్‌తో జతకట్టాడు విజయ్. మూవీ ప్రివ్యూ చూసిన లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తన ఫస్ట్ రివ్యూ ప్రకటించాడు. డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ మేకింగ్‌ను కొనియాడుతూ.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ యాక్టింగ్ ఫిదా అయ్యానన్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
పుకార్లకు చెక్ పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ - 'పుష్ప2' రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది!
ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీస్ లో ఒకటైన 'పుష్ప: ది రూల్' రిలీజ్ మరోసారి వాయిదా పడబోతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈరోజు సుకుమార్ బర్త్ డే సందర్భంగా మూవీ టీం రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లో తన క్రియేటివిటీతో విజన్ తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుకుమార్. 'పుష్ప'తో పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న 'పుష్ప 2' కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'మిస్ పర్ఫెక్ట్'గా మెగా కోడలు - లావణ్య, అభిజీత్‌ల వెబ్ సీరిస్ టీజర్ చూశారా?
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఒకటిగా పేరుగాంచిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ మధ్య సరికొత్త కంటెంట్ ని ఆడియన్స్ కి అందిస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లను మరోవైపు హారర్ తో పాటు డార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో సాగే సిరీస్ లతో సినీ లవర్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు మరో సరికొత్త సిరీస్ రాబోతోంది. ఆ వెబ్ సిరీస్ పేరే 'మిస్ పర్ఫెక్ట్'. మెగా కోడలు లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సిరీస్ ని అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. విశ్వక్ ఖండే రావు ఈ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)