నయనతార 'అన్నపూర్ణి' మూవీ టీంకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ షాకిచ్చింది. మూవీకి వస్తున్న వ్యతిరేకత, లీగల్‌ ఇష్యూ తలెత్తిన కారణంగా మూవీని తమ డిజిటల్‌ ప్లాట్‌ఫాం నుంచి తొలగించింది. దీంతో ప్రస్తుతం ఈ అంశం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'అన్నపూర్ణి'ని మొదటి నుంచి వివాదాలు చూట్టుముడుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ విడుదలయినప్పటి నుంచి  ప్రేక్షకులు, హిందూ సంఘాలు మూవీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చాయి. రామయాణంలో రాముడిపై హీరో చేప్పే ఓ డైలాగే దీనికి కారణం. ఓ సన్నివేశంలో హరో జై చెప్పే డైలాగ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచేలా ఉందని సినిమాను తీవ్ర వ్యతిరేకత చూపించారు.


మూవీ బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్‌ చేసినా. మూవీ మేకర్స్‌ వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్టే మూవీని థియేటర్లో విడుదల చేశారు. విడుదల తర్వాత కూడా మూవీపై నెగిటివిటీ తగ్గలేదు. తరచూ అన్నపూర్ణి ఏదోక వివాదంలో నిలుస్తూనే ఉంది. థియేటర్లో విడుదలైన సినిమా ఆఖరికి ఓటీటీకీ కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ గత వారం 'అన్నపూర్ణిని' రిలీజ్ చేసింది. దాంతో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతినిధి శ్రీరాజ్ నాయర్ ట్వీట్ చేశారు నెట్‌ఫ్లిక్స్‌, మూవీ టీం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూవీ వెంటనే నెట్‌ఫ్లిక్స్‌ నుంచి తొలగించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో 'అన్నపూర్ణి' సినిమాను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్‌ మీడియాలో, ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. 


అదే 'అన్నపూర్ణి'ని వివాదంలోకి నెట్టింది


నీలేష్ కృష్ణ తెరకెక్కించిన ‘అన్నపూర్ణి’లో బ్రహ్మణ కమ్యూనిటీకి చెందిన యువతిగా నయన్‌ నటించింది. బ్రహ్మణ కమ్యూనిటీకి చెందిన ఆమె చెఫ్‌ అవ్వాలని అనుకుంటుంది. చెఫ్‌గా అన్ని రకాలైన వంటకాలు వండాల్సి ఉంటుందని ఆమె తండ్రి అభ్యంతరం చెబుతాడు. అయినా చెఫ్‌ అవ్వాలనుకున్న ఆమె నాన్‌ వెజ్‌ వండాలా? వద్దా? అనే డైలామాలో ఉండగా.. హీరో జై ఓ సన్నివేశంలో నయనతారను మోటివేట్‌ చేసేందుకు కొన్ని మాటలు చెబుతాడు. అందుకు రామాయణంలోను ఉదాహరణగా చేసి చెబుతాడు. రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుల వనవాసంలో మాంసహారం వండుకుని తిన్నారంటూ చెప్పే ఈ సన్నివేశమే ఈ సినిమాను వివాదంలోకి నెట్టింది. దీంతో మూవీని బ్యాన్‌ చేయాలంటూ హిందూ సంఘాలు డిమాండ్‌ చేయడం మొదలుపెట్టాయి. దీంతో వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్‌ మూవీని తమ డిజిటల్‌ స్ట్రీమ్‌ నుంచి తొలగించింది. 


ఢిల్లీలో నయన్‌, నెట్‌ఫ్లిక్స్‌పై కేసు


నెట్‌ఫ్లిక్స్ నుంచి ‘అన్నపూర్ణి’ సినిమాను వ్యతిరేకిస్తూ శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి ఢిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూవీని పూర్తిగా బ్యాన్‌ చేయాలని, అన్నపూర్ణి తారాగణంతో పాటు మూవీ టీంపై ఢిల్లీ పోలీసు స్టేషన్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అంతేకాదు ‘అన్నపూర్ణి’ని యాంటీ హిందు సినిమా అని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒక బ్రాహ్మణ అమ్మాయి పాత్ర పోషిస్తూ.. మాంసం వండుతుంది. అలా వంట చేసేముందు తను నమాజ్ కూడా చేస్తుంది. సినిమాలోని ఈ సీన్స్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని రమేశ్ సోలంకి పేర్కొన్నారు. ఇక శ్రీరాజ్ నాయర్‌లాగానే హీరో జై పాత్ర రాముడిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.