Mahesh Babu-Ramya Krishna Song: మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగ జనవరి 12న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ముచ్చగా మూడోసారి వస్తున్న ఈ సినిమా పైనా భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఓరేంజిలో ఆకట్టుకున్నాయి. సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.


‘నాని’ మూవీలో రమ్యకృష్ణ, మహేష్ రొమాంటిక్ సాంగ్


ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లిగా కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే సినిమా కథ చాలా వరకు ఆమె చుట్టూనే తిరుగుతుందనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ, మహేష్ బాబుకు సంబంధించిన న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే? 2004లో మహేష్ బాబు, SJ సూర్య కాంబోలో ‘నాని’ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా అప్పట్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ‘నాని’లో రమ్యకృష్ణ, మహేష్ మధ్య ఓ మాస్ మసాలా రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ‘మార్కండేయా’ అంటూ సాగే ఈ పాటలో రమ్యకృష్ణ అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. కారణాలు ఏంటో తెలియదు కానీ, తర్వాత ఈ సినిమా నుంచి ఆ పాటను తొలగించారు. యూట్యూబ్ లో మాత్రం ఇప్పటికీ కనిపిస్తుంది.


సోషల్ మీడియాలో ‘మార్కండేయా’ సాంగ్ వైరల్


‘గుంటూరు కారం’ సినిమా విడుదల నేపథ్యంలో మళ్లీ ఈ పాటపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ‘నాని’ సినిమాలో మహేష్ తో రొమాన్స్ చేసిన రమ్యకృష్ణ ఇప్పుడు ఆయనకు తల్లిగా నటిస్తోందని డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే, నటీనటులు అన్నా, ఏ క్యారెక్టర్ అయినా చేయాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అన్ని పాత్రలు చేసినప్పుడే సంపూర్ణ నటులు అనిపించుకుంటారని వెల్లడిస్తున్నారు. అన్నా చెల్లెల్లుగా నటించిన వాళ్లు, భార్యాభర్తలుగా నటించడం, తండ్రి కూతుళ్లుగా నటించిన వారు, వైఫ్ అండ్ హస్బెండ్ గా నటించడం ఇప్పటికే పలు సినిమాల్లో చూశామంటున్నారు. అందరి లాగే అప్పుడు మహేష్ తో రొమాన్స్ చేసిన రమ్యకృష్ణ ఇప్పుడు తల్లిగా కనిపించబోతుందంటున్నారు.



త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించగా, తమన్‌ సంగీతం అందించారు. ఈ సినిమాతో పాటు సంక్రాంతి సందర్భంగా తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన ‘హనుమాన్’, వెంకటేష్, శైలేష్ కొలను మూవీ ‘సైంధవ్’, అక్కినేని నాగార్జున, విజయ్ బిన్నీ మూవీ ‘నా సామిరంగ’ విడుదల కానున్నాయి.     


Read Also: బుల్లితెరపై నాగార్జున సంక్రాంతి సందడి - బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో అక్కినేని ఆట అదుర్స్