Kesineni Chinni Comments On Kesineni Nani : వారం రోజుల నుంచి విజయవాడ రాజకీయం గుంటూరు కారం(Guntur Kaaram) కంటే ఘాటుగా ఉంది. ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) వైసీపీ(YSRCP)లో చేరుబోతున్నారని ప్రకటన చేసిన తర్వాత మరింత హాట్‌హాట్‌గా మారింది. ఆయన వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటిస్తూనే టీడీపీ అధినేత చంద్రబాబుపై, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు. 


టీడీపీ నుంచి ఘాటు రియాక్షన్


ఎంపీ కేశినేని నాని చేసిన కామెంట్స్‌పై టీడీపీ నుంచి అదే తీరున రియాక్షన్ వస్తోంది. బుధవారం సాయంత్ర బుద్ద వెంకన్న సవాల్ విసిరితే ఇవాళ మరో నేత ఫైర్ అయ్యారు. తాజాగా కేశినేని నాని సోదరుడు చిన్నిగా పిలుచుకునే కేశినేని శివనాథ్‌(Kesineni Shivanath) విమర్సలు గుప్పించారు. తమ కుటుంబంలో విభేదాలు తాజాగా వచ్చినవి కావని 1999 నుంచే ఉన్నాయని అన్నారు. కుటుంబ విభేదాలకు చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. 


కుటుంబ కలహాలపై నోరు విప్పిన చిన్ని


కేశినేని కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టారన్న నాని కామెంట్స్‌పై ఘాటుగా స్పందించారు చిన్ని. ఇరవై ఏళ్ల నుంచే తమ ఫ్యామిలీలో కలహాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు సృష్టించింది ఏమీ లేదన్నారు. 


నాని వెళ్లినంత మాత్రాన నష్టం లేదన్న చిన్ని


టీడీపీ నుంచి నాని లాంటివాళ్లు వెళ్లిపోయినంత మాత్రాన జరిగేదేమీ లేదన్నారు చిన్ని. టీడీపీ లాంటి పార్టీని ఎవరూ ఏం చేయలేరని చెప్పుకొచ్చారు. నాని లాంటి వాళ్లు, నారా , నందమూరి ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వాళ్లు పెట్టిన రాజకీయ భిక్షను మరిచిపోయి మాట్లాడటం సరికాదని సూచించారు. 


బుధవారం సీఎం జగన్‌తో సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేశినేని నాని టీడీపీ, చంద్రబాబు సహా ఇతర నేతలపై పరుష పదజాలంతో విమర్శలు చేశారు. సొంత వ్యాపారాల కంటే టీడీపీ కోసమే ఎక్కువగా పని చేశానని ఎంతో మంది చెప్పినా పట్టించుకోకుండా, పార్టీలోనే కొనసాగానని అన్నారు.  ఇన్ని రోజులు టీడీపీ కోసం, ప్రజల కోసం ఎంతో చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.2 వేల కోట్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పచ్చి మోసగాడు అని కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ, జెడ్పీటీసీ, ఎంపిటీసీ,  కార్పోరేషన్, జనరల్ ఎలక్షన్ ల ఖర్చులు తానే భరించినా, అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని చెప్పారు. టీడీపీలో ఇంక అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నేతల నుంచి ఎన్ని అవమనాలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డానని, చంద్రబాబు పచ్చి మోసగాడు అని ప్రపంచానికి తెలుసు, కానీ ఈ స్థాయిలో మోసం చేస్తాడని ఊహించలేదన్నారు. రాబిన్ శర్మ టీమ్ మన పార్టీకి ఎన్నికల్లో 5 కంటే ఎక్కువ సీట్లు రావని చెప్పారని.. కానీ ఆ రిపోర్ట్ బయటకు రావొద్దని తనకు సూచించినట్లు కేశినేని నాని వెల్లడించారు. ఓ వ్యక్తితో ప్రెస్ మీట్ పెట్టించి తనను ఉద్దేశపూర్వకంగానే తిట్టించారంటూ మండిపడ్డారు. చెప్పుతో నన్ను కొడతారని ఆ వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేస్తే సైతం పార్టీ నుంచి కనీసం స్పందన లేదన్నారు.


Also Read: నాని గెలిస్తే బుద్ధా భవన్ ఇచ్చేస్తా, ఓడితే కేశినేని భవన్ ఇచ్చేస్తావా - బుద్ధా వెంకన్న ఛాలెంజ్


Also Read:టీడీపీకి, విజయవాడ ఎంపీ పదవికి కేశినేని నాని రాజీనామా