Buddha Venkanna on Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తన భవనం బుద్ధా భవన్ తనకు ఇచ్చేస్తానని టీడీపీ నేత బుద్ధా వెంకన్న చెప్పారు. అదే ఓడిపోతే తన కేశినేని భవన్ ను తనకు ఇచ్చేయాలని సవాలు విసిరారు. జగన్ పెట్టిన ఆడుదాం ఆంధ్రలో ఇది కూడా ఒక ఆటగా ఆడదాం అని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబును మోసగాడు అన్న కేశినేని నాని పని అయిపోయిందని అన్నారు. నువ్వేంటి.. నీ స్థాయి ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధా వెంకన్న తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ జెండా పక్కన పడేస్తే నీకూ నాకూ విలువ లేదని తేల్చి చెప్పారు. చిరంజీవి రాజకీయ జన్మ ఇస్తే ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీని నాశనం చేశారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. తర్వాత చంద్రబాబు ఆదుకుంటే.. టీడీపీని కూడా మోసం చేశారని అన్నారు. నిన్నటిదాకా జగన్ ఓడిపోతారని, టీడీపీ గెలుస్తుందని చెప్పిన కేశినేని వ్యక్తికి.. ఇప్పుడు జగన్ దేవుడుగా మారిపోయారని విమర్శించారు.
Buddha Venkanna: నాని గెలిస్తే బుద్ధా భవన్ ఇచ్చేస్తా, ఓడితే కేశినేని భవన్ ఇచ్చేస్తావా - బుద్ధా వెంకన్న ఛాలెంజ్
ABP Desam
Updated at:
10 Jan 2024 05:57 PM (IST)
Buddha Venkanna Comments: జగన్ పెట్టిన ఆడుదాం ఆంధ్రలో ఇది కూడా ఒక ఆటగా ఆడదాం అని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబును మోసగాడు అన్న కేశినేని నాని పని అయిపోయిందని అన్నారు.
కేశినేని నాని, బుద్ధా వెంకన్న (ఫైల్ ఫోటోలు)
NEXT
PREV
నీకు రెండుసార్లు టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు మోసగాడా? నువ్వు ఒక్కరోజైనా కొడాలి నాని, వల్లభనేని వంశీ మీద నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? అలాంటి నువ్వు నీ అనుచరులతో కలిసి జగన్ వద్దకు కలుస్తావా? అలాంటి నువ్వు నిజాయతీ పరుడివా? విజయవాడకి నువ్వు కాపలాదారుడివా? నువ్వొక వైసీపీ కోవర్డువి. నీ స్నేహం అంతా విజయసాయి రెడ్డితోనే. ఒక్కోచోట ఒక్కో వైసీపీ నేతతో కేశినేని కలుస్తుంటారని అన్నారు.-
Published at:
10 Jan 2024 05:57 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -