BRS MLAs in Madurai court : భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి మధురై కోర్టులో ప్రత్యక్షమయ్యారు. వారిద్దరూ అక్కడి కోర్టు ఆవరణలో కూర్చుని ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అక్కడ వారే చేశారోనని చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే.. తెలంగాణ రాజకీయాల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలే వారిని మధురై కోర్టు వరకూ లాక్కొచ్చినట్లుగా తేలింది.
మాణిగం ఠాగూర్‌పై ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి
ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా గతంలో మాణిగం ఠాగూర్ ఉండేవారు. ఆ సమయంలో టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు మాణిగం ఠాగూర్ పై ఆరోపణలు చేశారు. ఐదు వందల కోట్లు తీసుకుని రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ గా నియమించారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై మాణిగం ఠాగూర్ మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలతో పరువు నష్టం చేశారని తన స్వస్థలం పరిధిలోకి వచ్చే మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు హాజరు కావాలని గతంలో కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ ఎమ్మెల్యేలు ఇద్దరూ పట్టించుకోకపోవంతో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
వాయిదాలకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్
అరెస్టు చేయడం ఖాయమని తేలడంతో వెంటనే కోర్టుకు హాజరై వాలెంట్లను రీకాల్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ మధురై కోర్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన మాణిగంఠాగూర్ తప్పుడు ఆరోపణలు చేసిన ఎవరినీ వదిలేదని.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ వ్యవహాారాల ఇంచార్జ్ గా ఉన్న మాణిగం ఠాగూర్
మాణిగం ఠాగూర్ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా మాణిక్ రావు ధాక్రే నియమితులయ్యారు. ఆయన తర్వాత ఇప్పుడు దీప్ దాస్ మున్షి నియమితులయ్యారు. మాణిగం ఠాగూర్ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్ గా వ్యవహరిస్తున్నారు.