Guntur Karam Pre-Release Event: ఇది ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకం - మహేష్‌ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌

Guntur Karam Event: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్‌ మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థీయేటర్లో సందడి చేయబోతుంది.

Continues below advertisement

Guntur Karam Pre-Release Event: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థీయేటర్లో సందడి చేయబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా గుంటూరులో మూవీ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. తన సొంత ఊరైన గుంటూరులో మూవీ పీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగడం.. దానికి భారీ రెస్పాన్స్‌ రావడంపై మహేష్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఇది ఎప్పటికి మరిచిపోలేని జ్ఞాపకమంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. 

Continues below advertisement

థ్యాంక్యూ గుంటూరు..!

తన పోస్టులో సోంతగడ్డపై తన మూవీ ఫంక్షన్‌ జరగడం చాలా ఆనందంగా ఉందని మహేష్‌ పేర్కొన్నాడు. ‘‘థ్యాంక్యూ గుంటూరు.. నేను పుట్టిన గడ్డపై నా మూవీ ఫంక్షన్‌ జరగడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమ, అభిమానాన్ని స్వయంగా చూశాను. ఇది నాకు చిరకాలంగా నిచిపోయే మధురమైన జ్ఞాపకం. మీరు చూపించిన ప్రేమను ఎప్పటికి మరవలేను. మీరంతా నా గుండెల్లో ఉన్నారు. నా సూపర్‌ ఫ్యాన్స్‌ మళ్లీ చూడాలని ఉంది. త్వరలో మళ్లీ కలుద్దాం. సంక్రాంతి ఇప్పుడే మొదలైంది’’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే గుంటూరు పోలీసులకు స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పారు. గుంటూరు కారం మూవీ ఈవెంట్‌కు సహకరించి సపోర్టు చేసిన పోలీసులను అభినందించారు. 

స్పీచ్‌తో సర్‌ప్రైజ్‌ చేసిన మహేష్‌.. 

నిన్న గుంటూరులో జరిగిన  గుంటూరు కారం ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ మంచి విజయం సాధించింది. భారీ స్థాయిలో ఫ్యాన్స్‌, ప్రేక్షకులు హాజరై ఈవెంట్‌ను సక్సెస్‌ చేశారు. ముఖ్యంగా ఈ ఫంక్షన్‌లో మహేష్‌ తన స్పీచ్‌తో అదరగొట్టాడు. సొంతగడ్డపై తనపై చూపించిన ప్రేమ, అభిమానానికి ఫిదా అయ్యాడు. అలాగే  తన తండ్రి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబును గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఫ్యాన్స్‌ ఉద్దేశిస్తూ.. మీరంతా ఎప్పటికీ నా గుండెలో ఉంటారని, మీరు చూపించే ప్రేమకు చేతులు ఎత్తి మొక్కడం తప్పా ఇంకేం చేయగలనంటూ ఫ్యాన్స్‌పై ప్రేమ కురిపించాడు. దీంతో మహేష్‌ స్పీచ్‌, మాటలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో వీటికి సంబంధించిన క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అలాగే ఈ ఈవెంట్‌ మహేష్ తన తండ్రిని(సూపర్‌ స్టార్ కృష్ణ) తలచుకుని ఎమోషనల్‌ అయ్యాడు. ‘‘నా మూవీ రిలీజ్‌ అవ్వగానే నాన్న ఫోన్‌ కాల్‌ కోసం ఎదురు చూసేవాడిని, ఆయన ఫోన్‌ చేసి నా లుక్‌, పర్ఫామెన్స్‌ గురించి రివ్యూ ఇచ్చేవారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు..’’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఎప్పుడు తక్కువ మాట్లాడే మహేష్‌.. ఫస్ట్‌ టైం స్టేజ్‌పై ఒపెన్‌ అవ్వడం అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది. దీంతో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అన్నింటిలో మహేష్‌ మాటలు, స్పీచ్‌కు సంబంధించిన క్లిప్సే దర్శనం ఇస్తున్నాయి. దీంతో గుంటూరు కారం ఈవెంట్‌కు సంబంధించిన ఈవెంట్స్‌ వీడియోలు‌ నెట్టింట్‌ ట్రెండింగ్‌లో నిలిచాయి. అలాగే మహేష్‌ స్పీచ్‌ ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్‌టాపిక్‌గా మారింది. 

Also Read: మా ఫ్యామిలీలో సున్నితం అనే పదానికి అర్థం తెలీదు- మనోజ్ భార్యని అలానే ఏడిపిస్తా.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్!

Continues below advertisement