Actress Manchu Lakshmi: మంచు మనోజ్ కి కొత్తగా పెళ్లయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తన రెండో భార్య భూమ మౌనిక ఒక రాజకీయ నాయకుడు కూతురు. పెళ్లి అయిన తర్వాత వీళ్ళిద్దరి గురించి మంచు లక్ష్మి మొట్టమొదటిసారిగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆ కబుర్లు ఏంటో చూద్దాం.
మున్ని రాకతో..
భూమ మౌనికను నేను ముద్దుగా మున్ని అని పిలుస్తాను. పెళ్లయిన తర్వాత తన రాకతో ఇంట్లో ఒక తెలియని లోటు నిండింది. నేను మామూలుగానే మంచు మనోజ్ ని నా కొడుకులా చూసుకుంటాను. ఇప్పుడు మున్ని ని కూడా నా కూతుర్లా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనోజ్ కన్నా మున్నినే నా సొంత కూతురిలా చూసుకుంటున్నాను. పాపం అది చాలా అమాయకురాలు.
ఏ ఆడపిల్లకైనా ఆ తోడు ఉండాలి....
మనోజ్ కన్నా మున్నిని ఎందుకు ఎక్కువగా చూసుకుంటున్నారు అంటే తను కుటుంబం అంతటినీ వదిలేసి మా కుటుంబానికి కొత్తగా వచ్చింది. ఈ టైంలో తనకి తన ఏజ్ వాళ్ళు ఎవరో ఒకరి తోడు తనకి చాలా అవసరం. అందుకే నేను మున్నిని చాలా ప్రేమగా చూసుకుంటాను. చాలా విషయాలు ఇద్దరూ పంచుకుంటాము. నా స్నేహితురాలాగే ఉంటాది. ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటాది. మున్నిది చాలా మెత్తని మనస్తత్వం. చాలా సింపుల్ గా ఉంటది. దేనికి ఎక్కువ హడావిడి చేయదు. మా ఇంట్లో సున్నితం అనే పదానికే అర్థం తెలియదు అలాంటిది మున్ని చాలా సున్నితంగా ఉంటది.
ఆ మాటతో ఏడిపిస్తూ ఉంటా...
మున్నిది చాలా చిన్న పిల్లలు మనస్తత్వం. అసలు అంత నెమ్మదిగా ఎలా ఉంటుందో అని మాకే ఆశ్చర్యం వేస్తూ ఉండేది. మరి ఇంత సున్నితంగా ఉంటే ఈ సమాజంలో ఎలా బతుకుతావే అని ఏడిపిస్తూ ఉంటాను. మా ఇంట్లో ఎవరూ అంత సున్నితంగా ఉండరు. మున్ని లా ఉండడం కూడా ఒక గొప్పే. అందుకే దాన్ని నేను సొంత కూతురులా చూసుకుంటాను. మనోజ్ కన్నా ఎక్కువ దానికే అమ్మనవ్వుతాను. ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడింది. మున్ని రాకతో మా కుటుంబం చాలా కంప్లీట్ అయింది. అందరికీ ప్రతి విషయంలోనే హెల్ప్ చేస్తూ ఉంటుంది. చాలా ఒదిగిన మనస్తత్వంతో ఉంటుంది మున్ని.
ఏదైనా గొడవ జరిగితే...
నాకు మనోజ్ కి గొడవైనా లేకపోతే మనోజ్ కి మున్నికి గొడవైనా సరే ముందు మున్నియే వెళ్లి సారీ చెప్పేస్తుంది. తప్పు ఉన్నా లేకపోయినా ఏ గొడవలు రాకుండా ఉండేటట్టు చూసుకుంటుంది మున్ని. తను చాలా అంటే చాలా సింపుల్. అసలు ఎలా పుట్టావే ఇలాగా అని అడుగుతూ ఉంటాను. ఏ విషయాన్నినైనా సింపుల్ గా తేల్చేస్తుంది. మనోజ్ కి సరైన జోడి అయ్యింది. వాళ్ళిద్దరి మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా గడుస్తుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం వాళ్ళిద్దరిని చూసి అని ఇంటర్వ్యూలో భూమికతో తనకున్న రిలేషన్షిప్ గురించి మాట్లాడింది మంచు లక్ష్మి.