Guntur Kaaram movie area wise distribution rights in Telugu states: 'గుంటూరు కారం' సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్లలోకి రావడానికి ఇంకెంతో సమయం లేదు. శుక్రవారం (జనవరి 12న) సంక్రాంతి కానుకగా సినిమా విడుదల అవుతోంది. ఆ రోజు మిడ్ నైట్ నుంచి బెనిఫిట్ షోలు పడతాయి. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. మరి, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? అనే వివరాల్లోకి వెళితే...


ఏపీ, తెలంగాణలో సెంచరీ కొట్టిన 'గుంటూరు కారం'
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'గుంటూరు కారం' సెంచరీ కొట్టింది. జస్ట్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా వంద కోట్లకు పైగా నిర్మాతలకు వచ్చాయి. ఏ ఏరియా రైట్స్ ఎంత అనే వివరాల్లోకి వెళితే... 



  • నైజాం ఏరియా - రూ. 42 కోట్లు

  • సీడెడ్ (రాయలసీమ) - రూ. 13.75 కోట్లు

  • ఉత్తరాంధ్ర (విశాఖ) - రూ. 14 కోట్లు

  • తూర్పు గోదావరి - రూ. 8.60 కోట్లు

  • పశ్చిమ గోదావరి - రూ. 6.50 కోట్లు

  • గుంటూరు - రూ. 7.65 కోట్లు

  • కృష్ణ - రూ. 6.50 కోట్లు

  • నెల్లూరు - రూ. 4 కోట్లు


Also Read'గుంటూరు కారం'కు 'దిల్' రాజు రివ్యూ - పేపర్లు ఎక్కువ పెట్టుకోండమ్మా, స్క్రీన్లు చిరుగుతాయ్


ఏపీ, తెలంగాణ... రెండు రాష్ట్రాల్లో 'గుంటూరు కారం' టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే? 102 కోట్ల రూపాయలు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి రూ. 9 కోట్లకు ఇచ్చారు. ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 20 కోట్లు వచ్చాయి. టోటల్ చూస్తే... 132 కోట్ల రూపాయలు. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే... మినిమమ్ రూ. 133 కోట్లకు కలెక్ట్ చేయాలి. 


మహేష్ లాస్ట్ ఐదు సినిమాల బిజినెస్ ఎలా జరిగింది?
మహేష్ బాబు కెరీర్ మొత్తం చూస్తే... ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో 'గుంటూరు కారం' హయ్యస్ట్ రికార్డ్ నమోదు చేసింది. దీనికి ముందు 'సర్కారు వారి పాట' రూ. 120 కోట్లు, 'సరిలేరు నీకెవ్వరు' & 'మహర్షి', 'భరత్ అనే నేను' సినిమాలు రూ. 100 కోట్లు చొప్పున ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన 'స్పైడర్' సినిమా 124 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. 'గుంటూరు కారం'తో తన సినిమాల్లో మహేష్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. సినిమా హైప్ చూస్తుంటే... ఈజీగా 150 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Also Readశ్రద్ధా శ్రీనాథ్ @ వైఫ్ రోల్స్ - గ్లామర్ రోల్స్ కాదు, సపరేటు రూటులో సైంధవ్ హీరోయిన్



'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం'. మహేష్ సరసన యంగ్ హీరోయిన్లు శ్రీ లీల, మీనాక్షీ చౌదరి నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మలయాళ నటుడు జయరామ్, రావు రమేష్, ఈశ్వరి రావు, వెన్నెల కిషోర్, 'రంగస్థలం' మహేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ప్రొడ్యూస్ చేశారు.