ఆపరేషన్ వాలెంటైన్ వీఎఫ్ఎక్స్ బడ్జెట్ అంతే - మొత్తం సినిమా ఖర్చు ఎంతో తెలుసా?
ఏరియల్ కాంబాట్ నేపథ్యంలో వచ్చిన ఇండియన్ సినిమాలు తక్కువ. ఈ జానర్ సినిమాలు హాలీవుడ్ ఎక్కువ తీసింది. టామ్ క్రూజ్ వంటి స్టార్ హీరోలు నటించిన 'టాప్ గన్'ను భారతీయ ప్రేక్షకులు సైతం చూశారు. ఇటీవల హిందీలో హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన 'ఫైటర్' కూడా ఏరియల్ కాంబాట్ సినిమాయే. ఆయా సినిమాల బడ్జెట్ వందల కోట్లు. మరి, తెలుగులో వచ్చిన ఆ జానర్ / ఏరియల్ కాంబాట్ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? జస్ట్ 42 కోట్లు మాత్రమే. అందులో వీఎఫ్ఎక్స్ బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం ఐదు కోట్లు మాత్రమే. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఓటీటీలోకి ‘ఆపరేషన్ వాలెంటైన్’ వచ్చేది అప్పుడే, ముందు తెలుగులో ఆ తర్వాతే హిందీ!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్‌కు సంబంధించిన కథాంశంతో ఈ మూవీ రూపొందుతోంది. వైమానిక దాడులు, దేశభక్తి కలబోతగా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ నిర్మించారు. బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా మార్చి 1న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో, ఈ సినిమా కోసం మెగా అభిమానులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నేనూ అణచివేతకు గురయ్యా - బాలీవుడ్ బయటవారిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు
బాలీవుడ్‌లో నెపోటిజం ఎక్కువ అని, స్టార్ కిడ్స్‌కి మాత్రమే అక్కడ రెడ్ కార్పెట్ పరుస్తారనేది చాలామంది నటీనటుల వాదన. అంతేకాదు ఈ అంశం ఎప్పుడూ హాట్‌టాపిక్‌గానే ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ కంగనా ఎప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తుంది. ఇప్పటికే చాలా మంది నటీనటులు సైతం హిందీ పరిశ్రమలో తెరవెనుక జరిగే ఎన్నో విషయాలు బయటపెట్టారు. అయితే ఈ సారి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
డార్లింగ్ కోసం హాలీవుడ్ హీరోయిన్‌ను రంగంలోకి దింపుతున్న హను రాఘవపూడి
టాలీవుడ్ లో ఉన్న చాలామంది స్టార్ హీరోలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సంవత్సరానికి ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోతున్నారు. ఇక పాన్ ఇండియా హీరోలైతే ఒక సినిమాకి రెండు నుంచి మూడేళ్లు తీసుకుంటున్నారు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఓవైపు కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తూనే మరోవైపు కొత్త ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇదెక్కడి పోస్టర్, ‘శ్రీవిష్ణు గాడి’ సినిమా నామకరణానికి వెరైటీ ఆహ్వానం
సినీ పరిశ్రమలో ప్రతీ సినిమాకు డిఫరెంట్ జోనర్లను ట్రై చేస్తూ నటులుగా గుర్తింపు తెచ్చుకోవాలి అనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అలాంటి వారిలో శ్రీ విష్ణు ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన శ్రీ విష్ణు.. హీరోగా మారిన తర్వాత ఎన్నో డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి వాటిలో ఒకటి ‘రాజ రాజ చోర’. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ సూపర్ సక్సెస్‌ను సాధించింది. ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడితో శ్రీ విష్ణు చేతులు కలపనున్నాడు. ఈ కాంబినేషన్‌కు సంబంధించిన అప్డేట్‌ను చాలా క్రియేటివ్‌గా బయటపెట్టింది టీమ్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)