Know about Varun Tej latest movie Operation Valentine budget: ఏరియల్ కాంబాట్ నేపథ్యంలో వచ్చిన ఇండియన్ సినిమాలు తక్కువ. ఈ జానర్ సినిమాలు హాలీవుడ్ ఎక్కువ తీసింది. టామ్ క్రూజ్ వంటి స్టార్ హీరోలు నటించిన 'టాప్ గన్'ను భారతీయ ప్రేక్షకులు సైతం చూశారు. ఇటీవల హిందీలో హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన 'ఫైటర్' కూడా ఏరియల్ కాంబాట్ సినిమాయే. ఆయా సినిమాల బడ్జెట్ వందల కోట్లు. మరి, తెలుగులో వచ్చిన ఆ జానర్ / ఏరియల్ కాంబాట్ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? జస్ట్ 42 కోట్లు మాత్రమే.
'ఆపరేషన్ వాలెంటైన్' వీఎఫ్ఎక్స్ బడ్జెట్ ఎంతో తెలుసా?
కేవలం 42 కోట్లలో 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా తీశారు. అందులో వీఎఫ్ఎక్స్ బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం ఐదు కోట్లు మాత్రమే. మీరు చదివింది నిజమే... నిర్మాత సిద్ధూ ముద్దా ఈ విషయం చెప్పారు.
Also Read: గూస్ బంప్స్ గ్యారెంటీ - ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ చూశారా?
ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి సందీప్ ముద్దా (సిద్ధూ ముద్దా)కు చెందిన రినైసన్స్ పిక్చర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. షూటింగ్, బడ్జెట్ గురించి సిద్ధూ ముద్దా మాట్లాడుతూ ''మా దగ్గర వందల కోట్ల బడ్జెట్ లేదు. అయితే, ప్రేక్షకులకు మంచి దేశభక్తి సినిమా ఇవ్వాలనే సంకల్పం బలంగా ఉంది. స్క్రిప్ట్ స్టేజి నుంచి ఎయిర్ ఫోర్స్ అధికారులతో చర్చించాం. మా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా పుల్వామా నేపథ్యంలో తీసిన షార్ట్ ఫిల్మ్ వాళ్లకు నచ్చింది. స్క్రిప్ట్ కూడా నచ్చింది. అందుకని, మాకు గ్వాలియర్ ఎయిర్ బేస్ లో షూటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. షూటింగ్ లొకేషన్ చార్జీలు సైతం తక్కువ తీసుకున్నారు'' అని చెప్పారు.
'ఫైటర్'కు ఆ అవకాశం ఇవ్వలేదు...
మా 'ఆపరేషన్ వాలెంటైన్'కు ఇచ్చారు!
సిద్ధూ ముద్దా మాట్లాడుతూ ''ఎయిర్ ఫోర్స్ అధికారులతో మాది వందల కోట్ల బడ్జెట్ సినిమా కాదని చెప్పాం. మాకు కొంచెం తక్కువ రేటుకు లొకేషన్లు ఇచ్చారు. పైగా, మా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా వీఎఫ్ఎక్స్ బ్యాక్‌డ్రాప్ నుంచి రావడంతో ఆయన ప్రీ ప్రొడక్షన్ నుంచి ఏ సీన్ ఎలా తీయాలనే వర్క్ చేశారు. దాంతో తక్కువ బడ్జెట్ పెట్టి ఇంత మంచి సినిమా తీయగలిగాం'' అని చెప్పారు.
తెలుగు పరంగా ఆ జాగ్రత్తలు తీసుకున్నాం!
'ఆపరేషన్ వాలెంటైన్' దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా హిందీ వ్యక్తి కావడంతో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సన్నివేశాలు రూపొందించడంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్మాత సిద్ధూ ముద్దా చెప్పారు. దర్శకుడుతో పాటు తాను, వరుణ్ తేజ్ కూర్చుని సన్నివేశాలపై చర్చించామని ఆయన వివరించారు. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ (Mickey J Meyer)తో నేపథ్య సంగీతంలో మన ప్రేక్షకులకు తగ్గట్టు చేయమని చెప్పామని తెలిపారు.
Also Read: అందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు