Sree Vishnu: సినీ పరిశ్రమలో ప్రతీ సినిమాకు డిఫరెంట్ జోనర్లను ట్రై చేస్తూ నటులుగా గుర్తింపు తెచ్చుకోవాలి అనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అలాంటి వారిలో శ్రీ విష్ణు ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన శ్రీ విష్ణు.. హీరోగా మారిన తర్వాత ఎన్నో డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి వాటిలో ఒకటి ‘రాజ రాజ చోర’. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ సూపర్ సక్సెస్‌ను సాధించింది. ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడితో శ్రీ విష్ణు చేతులు కలపనున్నాడు. ఈ కాంబినేషన్‌కు సంబంధించిన అప్డేట్‌ను చాలా క్రియేటివ్‌గా బయటపెట్టింది టీమ్.


ఎదురుచూస్తూ ఉండండి..


‘శ్రీ విష్ణు గాడి సినిమా’ అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. అందులో ఫిబ్రవరీ 29న ఉదయం 11.45 నిమిషాలకు నామకరణం.. అంటే టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ‘ఎదురుచూస్తూ ఉండండి. కచ్చితంగా తృప్తిపడతారు’ అంటూ సినిమా గురించి అప్పుడే హామీ కూడా ఇచ్చేస్తున్నారు మేకర్స్. అంతే కాకుండా ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నట్టు కూడా తెలిపారు. ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్ గోలి గాడి రాత, తీతతో ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రకటించారు. ఇక ‘రాజ రాజ చోర’ చూసి ఇంప్రెస్ అయిన ప్రేక్షకులు.. ఈ సినిమా కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు.


టైటిల్ అదేనా?


శ్రీ విష్ణు, హసిత్ గోలి కలిసి మరో సినిమా చేస్తారని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. తాజాగా దీని గురించి అనౌన్స్‌మెంట్ కూడా రావడంతో ప్రేక్షకులు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీ ‘రాజ రాజ చోర’కు ప్రీక్వెల్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘స్వాగ్’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. దర్శకుడిగా హసిత్ గోలి తెరకెక్కించింది ఒక్క చిత్రమే అయినా.. దాంతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అందుకే తన తరువాతి చిత్రం కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఫిబ్రవరీ 29న టైటిల్ రివీల్ చేస్తే ఈ మూవీ ‘రాజ రాజ చోర’కు ప్రీక్వెలా కాదా అనే విషయంపై ప్రేక్షకులకు ఒక క్లారిటీ వస్తుంది. 






‘ఓం భీమ్ బుష్’తో సిద్ధం..


2021లో విడుదలయిన ‘రాజ రాజ చోర’లో శ్రీ విష్ణు.. ఒక దొంగ పాత్రలో నటించాడు. సునయన, మేఘా ఆకాశ్ ఇందులో హీరోయిన్లుగా కనిపించారు. చాలాకాలం తర్వాత వేరే దర్శకుడి మేకింగ్‌లో రవి బాబు విలన్‌గా అలరించాడు. ఈ సినిమాలో ఎన్నో పాత్రలు ఉండగా.. ప్రతీ పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు హసిత్. ఇక శ్రీ విష్ణు సినిమాల విషయానికొస్తే.. తను చివరిగా ‘సామజవరగమన’ అనే చిత్రంలో నటించాడు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కలెక్షన్స్ విషయంలో రికార్డులు బ్రేక్ చేసింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లారు. ఇక ‘ఓం భీమ్ బుష్’ అనే చిత్రంతో మార్చిలో మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు శ్రీ విష్ణు.


Also Read: మహేష్ బాబు కోసం ఆ హాలీవుడ్ దర్శకుడిని రంగంలోకి దింపుతున్న జక్కన్న