SSMB29: రాజమౌళి సినిమా అంటేనే ఎక్కడాలేని క్రేజ్ ఉంటుంది. అలాంటిది మహేష్ బాబుతో మూవీ అంటే ఆ క్రేజ్ మమూలుగా ఉండదు. సినిమా ఇంకా మొదలు కాకముందే.. వీరి కాంబినేషన్‌పై అంచనాలు మొదలైపోయాయి. ఇక సినిమా విడుదలైతే ఆ హైప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు. యాక్షన్, ఫారెస్ట్ అడ్వేంచర్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఊరించింది చాలు.. అప్‌డేట్ చెప్పవయ్య జక్కన్నా అని మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మహేష్-జక్కన్న మూవీ కోసం ఓ హాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్ త్వరలోనే ఇండియాకు రాబోతున్నారట. ఆయన ఎందుకు వస్తున్నారనేది త్వరలోనే రివీల్ చేస్తారట.


రూల్స్ పెట్టాడంటే.. సినిమా మొదలైనట్లే!


ఇప్పటికే జక్కన్న.. SSMB29 మూవీని తెరకెక్కించేందుకు ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయారు. మహేష్ బాబు కూడా తన ఫిట్‌నెస్ ట్రైనర్‌తో సరికొత్త లుక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు లుక్ బయటకు రాకుండా జక్కన్న జాగ్రత్తపడుతున్నాడు. మహేష్ బాబుతో సహా మూవీ యూనిట్ మొత్తానికి కొన్ని రూల్స్ పెట్టాడట. మహేష్ బాబు కొన్నాళ్లు పబ్లిక్‌కు కనిపించకూడదని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనేది జక్కన్న ఫస్ట్ రూల్. అలాగే, షూటింగ్‌కు సంబంధించిన ఏ ఒక్క ఫొటో, వీడియో బయటకు పోకూడదనేది తన టీమ్‌కు విధించిన రూల్. అలాగే, షూటింగ్ లొకేషన్స్‌కు కేవలం ఆ చిత్రానికి పనిచేస్తున్న సిబ్బందికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. RRR మూవీ తరహాలోనే.. నటీనటులు, చిత్ర యూనిట్‌కు ప్రత్యేకంగా ఐడీ కార్డులు ఇస్తున్నట్లు సమాచారం. అలాగే కొన్ని పొరాట సన్నివేశాల కోసం నటీనటులకు వర్క్‌షాప్ కూడా నిర్వహిస్తారట.


షూటింగ్ ఎప్పుడు? ఆ హాలీవుడ్ డైరెక్టర్‌ను ఆహ్వానిస్తున్నారా?


ఈ మూవీకి ‘మహారాజా’ అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ మూవీకి సంబంధించిన స్క్రీప్ట్ ఇప్పటికే సిద్ధమైపోయిందని, మార్చి నెలలో షూటింగ్ మొదలు కానుందని ప్రచారం. ఈ సందర్భంగా రాజమౌళి ఓ హాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవ్వరో కాదు.. జేమ్స్ కామెరూన్. ‘టైటానిక్’, ‘అవతార్’ వంటి సినిమాలతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న దర్శకదిగ్గజం మహేష్ మూవీ కోసం ఇండియా వస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


‘ఇండియనా జోన్స్’, ‘జురాసిక్ పార్క్’ వంటి సినిమాలను ప్రపంచానికి అందించిన మరో దర్శక దిగ్గజం స్టీవెన్ స్పీల్‌బర్గ్ సైతం ఈ మూవీ ప్రారంభోత్సానికి హాజరుకానున్నారని సమాచారం. వీరిని ఇండియాకు తీసుకొచ్చే బాధ్యతలను ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్నట్లు తెలిసింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించే ఉద్దేశంతోనే రాజమౌళి.. ఆయన్ని ఆహ్వానిస్తున్నారు కాబోలు అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఏమిటనేది తెలియాల్సి ఉంది. 


రాజమౌళి పిలిస్తే వస్తారా?


రాజమౌళి పిలిస్తే జేమ్స్ కామెరూన్ వస్తారా? ఆయనకు అంత సీన్ ఉందా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, కామెరూన్‌ ఇప్పటికే రాజమౌళితో ఉన్న అభిమానాన్ని ఓ వీడియో ద్వారా వెల్లడించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘RRR’ మూవీతో రాజమౌళి అద్భుతం చేశారు. ఆయన్ను కలవడం ఎప్పటికీ మరిచిపోలేను. ప్రపంచ వేదికపై ఇండియన్ సినిమాను చూడటం చాలా సంతోషం కలిగించింది’’ అని అన్నారు. మరి అంత అభిమానం చూపిన జేమ్స్.. జక్కన్న పిలిస్తే రాకుండా ఉంటారా? ఈ మూవీని ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కించాలంటే రాజమౌళికి.. అలాంటి లెజెండ్ అవసరం సలహాలు, సూచనలు తప్పక ఉండాలి. అప్పుడే అది ప్రపంచ ప్రేక్షకులకు దగ్గరవుతుంది.


Also Read: 'ఆపరేషన్ వాలెంటైన్' ఫస్ట్ రివ్యూ - సినిమా చూసిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ రియాక్షన్ ఏమిటంటే?