దర్శకుడిగా పరిచయమైన 'ఆర్ఎక్స్ 100' సినిమాతో అజయ్ భూపతి సంచలనాలు నమోదు చేశారు. ఆ తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా... అదితి రావు హైదరి కథానాయికగా 'మహా సముద్రం' తీశారు. ఆయన దర్శకత్వం వహించిన మూడో చిత్రం 'మంగళవారం'. కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోగా... ఆ తర్వాత ఓటీటీలో కూడా మంచి వీక్షకాదరణ సొంతం చేసుకుంది. లేటెస్టుగా టీవీలో 'మంగళవారం' టెలికాస్ట్ అయ్యింది. ఈ చిత్రానికి రికార్డ్ స్థాయిలో టీఆర్పీ వచ్చింది. 


'మంగళవారం' చిత్రానికి 8.3 టీఆర్పీ
Mangalavaaram TRP: పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తీసిన 'మంగళవారం'లో ప్రియదర్శి పులికొండ హీరో. థియేటర్లలో విడుదల అయ్యే వరకు మాస్క్ వెనుక ఉన్నది ఎవరు? అనేది రివీల్ చేయలేదు. సస్పెన్స్‌లో ఉంచారు. ఆ మాస్క్ మనిషి ప్రియదర్శి అని తెలుసుకున్న ప్రేక్షకులు సర్‌ప్రైజ్ ఫీల్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత సస్పెన్స్ రివీల్ చేసినా... ప్రేక్షకులు సినిమా చూశారు. ఆ స్థాయిలో అజయ్ భూపతి సినిమా తెరకెక్కించారు. 


'మంగళవారం' శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుంది. ఈ మధ్య సినిమాను టెలికాస్ట్ చేయగా... అర్బన్ ప్లస్ రూరల్ కలిపి 8.3 రేటింగ్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', న్యాచురల్ స్టార్ నాని 'దసరా', దళపతి విజయ్ 'లియో' సినిమాల కంటే ,మంగళవారానికి ఎక్కువ టీఆర్పీ రావడం ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న క్రేజ్ తెలియజేస్తోంది. ఇటీవల 'స్టార్ మా' ఛానల్ టెలికాస్ట్ చేసిన సినిమాల్లో హయ్యస్ట్ టీఆర్పీ సొంతం చేసుకున్న సినిమాగా మంగళవారం నిలిచిందని తెలిసింది. దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం సంతోషాన్ని మరింత పెంచింది.


Also Read: నాగబాబుకు వేరే ఉద్ధేశాలు లేవు... ఆయన రామ్ చరణ్, ఎన్టీఆర్‌ ను కామెంట్ చేయలేదు!






పాయల్, ప్రియదర్శి, అజ్మల్ అమీర్, నందితా శ్వేత, అజయ్ ఘోష్, దివ్యా పిళ్ళై, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, లక్ష్మణ్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ... కథే హీరోగా స్టార్ కాస్ట్ లేకుండా 'మంగళవారం' తీసి అజయ్ భూపతి హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో హృద్యమైన కథ, ఆకట్టుకునే ట్విస్టులు, అదిరిపోయే సంగీతం, కెమెరా పనితనం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.


Also Readఅందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు


'ఆర్ఎక్స్ 100' తర్వాత ఆమెకు మరో హిట్!
'ఆర్ఎక్స్ 100' తర్వాత పాయల్ (Payal Rajput)కు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే... ఆ స్థాయి విజయం మాత్రం ఆమెకు రాలేదు. ఆమెకు జస్ట్ గ్లామర్ డాల్ ఇమేజ్ వచ్చింది. 'మంగళవారం'తో మరోసారి నటిగా పాయల్ ను పరిచయం చేశారు అజయ్ భూపతి. ఆమెకు మరో విజయం అందించారు. ఈ సినిమా దర్శకుడిగా ఆయనకు కూడా మంచి విజయం అందించింది. 'విరూపాక్ష' తర్వాత కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్ తెలుగులో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.