Sidharth Malhotra About Ram charan, Rajamouli and Allu Arjun: సిద్ధార్థ్ మల్హోత్రా.. ప్రస్తుతం ‘యోధ’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటరవ్యూలు ఇస్తూ మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు సిద్ధార్థ మల్హోత్ర, రాశీఖన్నా, చిత్రబృందం. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. తెలుగులో తనకు నచ్చే డైరెక్టర్, హీరోల గురించి చెప్పుకొచ్చారు సిద్ధార్థ్ మల్హోత్రా. 'గేమ్ ఛేంజర్' సినిమా గురించి తన భార్య కియారా చాలా విషయాలు చెప్తుందని ఆయన అన్నారు.
రాజమౌళి సార్ ఫేవరెట్..
"తెలుగులో సినిమా చేసే అవకాశం ఉందా?" అని అడిగిన ప్రశ్నకి సిద్ధార్థ్ మల్హోత్రా ఇలా సమాధానం చెప్పారు. "మంచి క్యారెక్టర్ వస్తే కచ్చితంగా పనిచేస్తాను. టాలీవుడ్ లో డైరెక్టర్లు, రైటర్లు హీరో క్యారెక్టర్ ని చాలా బాగా రాస్తారు. అది నాకు చాలా నచ్చుతుంది. ఇక్కడ చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్లు, రైటర్లు ఉన్నారు. వాళ్లతో పనిచేసే ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. టాలీవుడ్ డైరెక్టర్స్ లో రాజమౌళి సార్ అంటే చాలా ఇష్టం. అన్ని రోజులు షూటింగ్ చేసినా ఎంజాయ్ చేసేలా చేస్తారు. స్క్రీన్ మీద హీరో సెలబ్రేట్ చేసుకునేలా చూపిస్తారు. అల్లు అర్జున్ వర్క్, రామ్ చరణ్ వర్క్ చాలా స్ఫూర్తిగా అనిపిస్తుంది. నా భార్య కియారా కూడా రామ్ చరణ్, శంకర్ సార్ 'గేమ్ ఛేంజర్' లో వర్క్ చేస్తోంది. ఆమె ఇక్కడి వర్క్ కల్చర్, తన వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి చాలా చెప్తుంది" అని అన్నారు సిద్ధార్థ్ మల్హోత్రా.
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 'గేమ్ చేంజర్' సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్న కియారా అద్వానీ, సిద్ధార్థ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2020లో ‘షెర్షా’ మూవీ షూటింగ్ సమయంలో కియారాతో సిద్ధార్థ్ ప్రేమలో పడ్డాడని రూమర్స్ వచ్చాయి. ఇక 2023లో వీరు పెళ్లితో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత ‘మిషన్ మజ్ను’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. ఇక ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘యోధ’. ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించి పోస్టర్లు, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించారు. ‘యోధ’ స్ఫూర్తిదాయకంగా, దేశ భక్తి కలిగిన సినిమా అని రాశీఖన్నా అన్నారు. ఈ సినిమాలో చేయడం అద్భుతమైన అనుభూతి అని ఆమె చెప్పారు.
Also Read: 'హరిహర వీరమల్లు' ఆగిపోలేదు - సినిమాకి రెండో భాగం కూడా ఉంది : నిర్మాత ఏ.ఎం రత్నం