Operation Valentine Gets Compliments From Air Force Officers: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్'. మార్చి 1న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల అవుతోంది. అయితే... ఆల్రెడీ ఈ సినిమాను కొందరికి చూపించారు. వాళ్ళ నుంచి వచ్చిన రివ్యూ ఏంటో చూడండి.


పుల్వమా ఘటనపై వచ్చిన బెస్ట్ సినిమా...
పుల్వామాలో ఫిబ్రవరి 14, 2019న సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా భారతీయ వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా ఈ 'ఆపరేషన్ వాలెంటైన్' తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అందుకని, సినిమా స్టోరీ వర్క్ దగ్గర నుంచి ఎయిర్ ఫోర్స్ అధికారుల సలహాలు, సూచనలతో పాటు వాళ్ల అనుమతులు తీసుకున్నారు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. సినిమా పూర్తి అయ్యాక వాళ్లకు సినిమా చూపించారు. 


వరుణ్ తేజ్ మాట్లాడుతూ... ''ఎయిర్ ఫోర్స్ అధికారులకు సినిమా చూపించాం. ఇప్పటి వరకూ పుల్వామా ఘటనపై వచ్చిన సినిమాల్లో 'ఆపరేషన్ వాలెంటైన్ ది బెస్ట్ మూవీ' అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు'' అని చెప్పారు. ప్రతి భారతీయుడు సినిమా చూసి ఎమోషనల్ అవుతారని, ఆ భావోద్వేగాలతో కనెక్ట్ అవుతారని ఆయన చెప్పారు.


ఆపరేషన్ వాలెంటైన్ పేరు ఎందుకు పెట్టామంటే? 
సినిమా టైటిల్ గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ... ''పుల్వామా ఘటన ఫిబ్రవరి 14న జరిగింది. అదే రోజున మన ఎయిర్ ఫోర్స్ బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. వాలెంటైన్ డే రోజున శత్రువులకు రిటర్న్ గిఫ్ట్‌గా ఈ ఎటాక్ ప్లాన్ చేశారు. మా సినిమా వరకు వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద ఉన్న ప్రేమ'' అని తెలిపారు.


తెలుగులో చేద్దామనుకున్నా! కానీ, సోనీ రావడంతో!
తొలుత 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రాన్ని తెలుగులో చేయాలని అనుకున్నట్లు వరుణ్ తేజ్ చెప్పారు. అయితే, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థ రావడంతో హిందీలో కూడా తీశామని తెలిపారు.


Also Readనాగబాబుకు వేరే ఉద్ధేశాలు లేవు... ఆయన రామ్ చరణ్, ఎన్టీఆర్‌ ను కామెంట్ చేయలేదు!


'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా ఎలా మొదలైందనే దాని గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ... ''శక్తి ప్రతాప్ సింగ్ 2020లో నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు కథ నచ్చింది. అంతకు ముందు సోనీ పిక్చర్స్ సంస్థతో నేను ఓ సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఈ కథ సోనీకి పంపించా. వాళ్ళకీ నచ్చింది. వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేస్తున్నారు. పక్కా ప్రణాళికతో సినిమా చేశారు. దర్శకుడు శక్తి హిందీ అబ్బాయి అయినప్పటికీ... తెలుగులో చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉంది. సోనీ పిక్చర్స్ వచ్చిన తర్వాత హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ప్రతి సన్నివేశాన్ని తెలుగు, హిందీ రెండు భాషల్లో షూట్ చేశాం'' అని చెప్పారు. 


Also Readఅందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు


వరుణ్ తేజ్ సరసన మానుషీ చిల్లర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. వాళ్ళిద్దరి గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ... ''మానుషి మిస్‌ వరల్డ్ విన్నర్. ఆ పోటీల్లో విజేతగా నిలవడం అంత సులభం కాదు. ఆమె దేశానికి ఎంతో పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా కోసం హార్డ్ వర్క్, హోమ్ వర్క్ చేసింది. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ అంటే ముంబై నుంచి హైదరాబాద్ ఫ్లైట్ జర్నీ చేసేది. రాడార్ ఆఫీసర్ పాత్రలో బాగా నటించింది. మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ కంపోజర్. అతను అయితే బావుంటుందని దర్శకుడు అడిగారు. ఇందులో పాటలు మనసును హత్తుకునేలా భావోద్వేగభరితంగా సాగుతాయి. నేపథ్య సంగీతం కూడా బావుంటుంది'' అని చెప్పారు.