వినాయక్ దేశాయ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'రాధా మాధవం'. ఇందులో ఆయనకు జోడీగా అపర్ణా దేవి నటించారు. ఆమె మలయాళీ. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్. ఈ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో గోనల్ వెంకటేష్ చిత్రాన్ని నిర్మించారు. కథ, మాటలతో పాటు పాటలను వసంత్ వెంకట్ బాలా అందించారు. మార్చి 1న థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది. 






రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశాం
సినిమా విడుదల సందర్భంగా నిర్మాత గోనాల్ వెంకటేష్ మాట్లాడుతూ... ''మా 'రాధా మాధవం' చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు... ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఇదొక అందమైన ప్రేమ కథా చిత్రం. మార్చి 1న థియేటర్లలోకి వస్తోంది. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని, పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా'' అని అన్నారు. దర్శకుడు దాసరి ఇస్సాకు మాట్లాడుతూ... ''కథ విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మా రైటర్ వసంత్ వెంకట్ బాలా అంత అద్భుతమైన కథ రాశారు. కథ విన్నాక నాకు వినాయక్ గుర్తుకు వచ్చాడు. ఆయన హైట్‌ ఎక్కువ. ఆయనకు తగ్గ అమ్మాయిని వెతగ్గా... అపర్ణా దేవి గారు కనిపించారు. ఆమె చక్కగా నటించారు'' అని చెప్పారు.


Also Read: బాబాయ్ సినిమాతో పోటీ లేదు - క్రిస్మస్‌కి అబ్బాయ్ సినిమా


యాక్షన్ సీక్వెన్సులు సహజంగా ఉంటాయి!
హీరో వినాయక్ దేశాయ్ మాట్లాడుతూ... ''మా నిర్మాత సహకారంతో సినిమా ఇక్కడి వరకు వచ్చింది. నేను కొత్త హీరో అయినా నాపై నమ్మకంతో ఖర్చుకు వెనకడుగు వేయకుండా చిత్రాన్ని నిర్మించారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ సహజంగా ఉంటాయి. హీరోయిన్ మలయాళీ, పైగా క్లాసికల్ డ్యాన్సర్. ఆమెతో నటించడం ఆనందంగా ఉంది. పార్ధు మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు'' అని చెప్పారు. అపర్ణా దేవి మాట్లాడుతూ... ''నేను మలయాళీ కావడంతో నాకు తెలుగు అంతగా రాదు. ఈ సినిమాలో ఏమో లెంగ్తీ డైలాగులు ఉన్నాయి. వినాయక్ సపోర్ట్ చేయడంతో కాస్త ఈజీగా నటించాను'' అని చెప్పారు. మాటల రచయిత వసంత్ వెంకట్ బాల మాట్లాడుతూ... ''సినిమా బాగా వచ్చింది. అందమైన గ్రామీణ ప్రేమ కథతో పాటు చక్కని సందేశాన్ని 'రాధా మాధవం' సినిమా ద్వారా ఇచ్చాం. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు'' అని చెప్పారు.


Also Readబాయ్‌ ఫ్రెండ్ ఛీట్ చేస్తే బాధపడాలా? - ఆయుషికి త్రిగుణ్ చెప్పిన మాట బావుందమ్మా, మీరూ చూడండి






వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా నటించిన ఈ సినిమాలో మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాత:  గోనాల్ వెంకటేష్, దర్శకత్వం: దాసరి ఇస్సాకు, కథ - మాటలు - పాటలు: వసంత్ వెంకట్ బాలా, సంగీతం : చైతు కొల్లి, ఛాయాగ్రహణం: తాజ్ జీడీకే, కూర్పు: కె. రమేష్, పోరాటాలు: రాబిన్ సుబ్బు.