Game Changer to release on December 25th 2024: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌత్ ఇండియన్ స్టార్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్'. సెట్స్ మీదకు వెళ్లి చాలా రోజులైంది. కానీ, రిలీజ్ ఎప్పుడు? అనేది క్లారిటీ లేదు. ఆ మధ్య ఓ వేడుకలో 'అంతా శంకర్ చేతుల్లో ఉంది' అని నిర్మాత దిల్ రాజు సైతం చెప్పారు. అయితే... ఇటీవల ఈ సినిమా విడుదల తేదీ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే... రామ్ చరణ్ బాబాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ'తో క్లాష్ కానుందని!


బాబాయ్ సినిమాకు పోటీ అబ్బాయ్ సినిమా రావడం లేదు!
పవన్ కళ్యాణ్ హీరోగా 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న 'ఓజీ'ని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. అయితే... ఆ తేదీకి తమ సినిమాను కూడా విడుదల చేయాలని రామ్ చరణ్, దిల్ రాజు అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే... ఆ ప్రచారంలో నిజం లేదని, బాబాయ్ సినిమాకు పోటీగా అబ్బాయ్ సినిమా రావడం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 


క్రిస్మస్ కానుకగా 'గేమ్ ఛేంజర్' విడుదల!?
'గేమ్ ఛేంజర్' కాకుండా కమల్ హాసన్ హీరోగా 'ఇండియన్ 2' సినిమా కూడా శంకర్ చేస్తున్నారు. ఆ చిత్రాన్ని మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత 'గేమ్ ఛేంజర్'ను దసరా లేదా దీపావళికి విడుదల చేయాలని తొలుత ప్లాన్ చేశారు. అయితే... ఇప్పుడు ప్లాన్ మారిందని, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల చేయాలని రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు డిసైడ్ అయ్యారట. బహుశా... చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న అనౌన్స్ చేస్తారేమో చూడాలి.


Also Read'ఆపరేషన్ వాలెంటైన్' ఫస్ట్ రివ్యూ - సినిమా చూసిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ రియాక్షన్ ఏమిటంటే?


'గేమ్ ఛేంజర్'ను శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ సంస్థలో 50వ చిత్రమిది. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ నటిస్తున్నారు. 'వినయ విధేయ రామ' తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రమిది. తెలుగమ్మాయి అంజ‌లి మరో కథానాయిక. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంలో చరణ్ భార్యగా ఆమె కనిపిస్తారని తెలిసింది. సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ఇతర ప్రధాన తారాగణం.


Also Readబాయ్‌ ఫ్రెండ్ ఛీట్ చేస్తే బాధపడాలా? - ఆయుషికి త్రిగుణ్ చెప్పిన మాట బావుందమ్మా, మీరూ చూడండి


'గేమ్ ఛేంజర్' చిత్రానికి రచయితలు:  ఎస్‌.యు. వెంక‌టేశ‌న్‌, ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ & వివేక్‌, స్టోరీ లైన్‌: కార్తీక్ సుబ్బ‌రాజ్‌, మాటలు: సాయిమాధ‌వ్ బుర్రా, సహ నిర్మాత: హ‌ర్షిత్‌, ఛాయాగ్రహణం: ఎస్‌. తిరుణావుక్క‌ర‌సు, సంగీతం: త‌మ‌న్, నిర్మాత‌లు:  దిల్ రాజు & శిరీష్‌, ద‌ర్శ‌క‌త్వం : శంక‌ర్.