Shahid Kapoor Comments on Bollywood: బాలీవుడ్‌లో నెపోటిజ ఎక్కువ అని, స్టార్‌ కిడ్స్‌కి మాత్రమే అక్కడ రెడ్‌ కార్పెట్‌ పరుస్తారనేది చాలామంది నటీనటుల వాదన. అంతేకాదు ఈ అంశం ఎప్పుడూ హాట్‌టాపిక్‌గానే ఉంటుంది. ముఖ్యంగా ఫైర్‌ బ్రాండ్‌ కంగనా ఎప్పుడూ హాట్‌ కామెంట్స్‌ చేస్తుంది.  ఇప్పటికే చాలా మంది నటీనటులు సైతం హిందీ పరిశ్రమలో తెరవెనుక జరిగే ఎన్నో విషయాలు బయటపెట్టారు. అయితే ఈ సారి ఏకంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. 


ఓ టాక్‌ షోలో పాల్గొన్న షాహిది బాలీవుడ్‌ డార్క్‌ సైడ్‌ గురించి నోరు విప్పాడు. ఇక్కడ క్యాంపీ కల్చర్‌(ఇండస్ట్రీ వారినే కలుపుకోవడం) ఉందని, బయటి వ్యక్తులను యాక్సెప్ట్‌ చేయరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం షాహిద్ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాయి. అతడి లేటెస్ట్‌ మూవీ 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా' ఫిబ్రవరి 9న రి రిలీజై మంచి విజయం సాధించింది. ఇందులో కృతి సనన్‌ హీరోయిన్‌. ప్రస్తుతం'తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా' సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్న షాహిద్‌ తాజాగా నేహా దూపియా నో ఫిల్టర్‌ నేహా షోలో పాల్గొన్నాడు. 


ఇక్కడ అణచివేత గురయ్యాను


ఈ సందర్భంగా ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండ ఇండస్ట్రీకి వచ్చిన షాహిద్‌.. తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇండస్ట్రీ కూడా నాకు స్కూలులా అనిపించింది. నా చిన్నప్పుడు మేము ఢిల్లీ నుంచి ముంబయికి షిఫ్ట్‌ అయ్యాం. అప్పుడు రెంటెడ్‌ హౌజ్‌లో ఉండే వాళ్లం. దాంతో నాకు ఎక్కువ ఫ్రెండ్స్‌ ఉండేవాళ్లు కాదు. ఇక స్కూలు, కాలేజీలు కూడా మారుతూ ఉండటం వల్ల అప్పుడు నన్ను త్వరగా యాక్సెప్ట్‌ చేయసేవాళ్లు కాదు. నాతో ఎవరూ సరిగా మాట్లాడేవారు కాదు. చాలా బ్యాడ్‌గా ట్రీట్‌ చేసేవారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు సేమ్‌ అలాంటి ఫీలింగే వచ్చింది. ఎవరూ కూడా నాతో మాట్లాడేవారు కాదు. ప్రొత్సహించేవారు కాదు. నన్ను అణచివేస్తున్న భావన కలిగింది. అది నన్ను చాలా బాధించింది" అంటూ చెప్పుకొచ్చాడు. 


ఈ క్యాంపీ కల్చర్ అసలు నచ్చదు


అనంతరం మాట్లాడుతూ.. "హిందీలో బయటి వ్యక్తులను అంత ఈజీగా అంగీకరించరు. ఇక్కడ అణచివేత ఎక్కువ. మొదట్లో నేను కూడా అణచివేతకు గురయ్యా.  కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వండి. వారి టాలెంట్‌ని ప్రొత్సహించండి అని చెబుతూంటాను. కానీ వినిపించుకోరు. నాకు ఈ క్యాంపీ కల్చర్‌ అసలు నచ్చదు. అందరిని కలుపుకునిపోవాలి. అణచివేత ధోరణి కరెక్ట కాదు అని భావిస్తాను. అందరిని కలుపుకోవడమే మంచిది అనేది నా అభిప్రాయం" అని పేర్కొన్నాడు. కాగా ఫాహిద్‌ కపూర్‌ సెల్ఫ్‌ మెయిడ్‌ యాక్టర్‌, ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండ ఇండస్ట్రీకి వచ్చి స్టార్‌ హీరోగా ఏదిగాడు. 2003లో 'ఇష్క విష్క్‌' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. డ్యాన్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాడు. స్వయం కృషితో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు స్టార్‌ హీరో ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు.


Also Read: ఆ హోటల్‌లో దెయ్యాలు ఉన్నాయని భయపెట్టింది - నిహారికపై సుమంత్ అశ్విన్ కామెంట్స్